ASBL Koncept Ambience
facebook whatsapp X

సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోనున్న వెంకీ?

సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోనున్న వెంకీ?

2025 సంక్రాంతికి రానున్న సినిమాల విష‌యంలో స‌స్పెన్స్ రోజురోజుకీ పెరిగిపోతుంది. అన్నింటికంటే ముందుగా సంక్రాంతికి వ‌స్తామ‌ని చెప్పిన విశ్వంభ‌ర(Viswambhara) వాయిదా ప‌డిపోయింది. ఆ ప్లేస్ లో గేమ్ ఛేంజ‌ర్(game changer) వ‌స్తుంద‌నే వార్త మెగా ఫ్యాన్స్ కు కొంత సంతోషాన్ని, కొంత బాధ‌ను మిగిల్చింది. బాల‌య్య‌109(NBK109) టైటిల్ ఫిక్స్ కాగానే రిలీజ్ డేట్ తో లాక్ చేయ‌నున్నారు. జ‌న‌వరి 12 రిలీజ్ డేట్ అంటున్నారు.

తండేల్(thandel) సినిమాను సంక్రాంతి రిలీజ్ చేయాలా లేదా అనే ఆలోచ‌నలో బ‌న్నీ వాస్(Bunny vaas), అల్లు అర‌వింద్(allu aravind) ఉన్నారు. సంక్రాంతి మిస్ అయితే రిప‌బ్లిక్ డే కు రిలీజ్ చేస్తారు. అయితే మొద‌టినుంచి పండగ‌కి రిలీజ్ చేద్దామ‌ని ప‌క్కా ప్లానింగ్ తో షూటింగ్ జ‌రుపుకుంటున్న వెంకీ(venkatesh)- అనిల్ రావిపూడి(anil ravipudi) సినిమాను సంక్రాంతి రేసు నుంచి  త‌ప్పించాల‌ని నిర్మాత దిల్ రాజు(dil raju) అనుకుంటున్నాడ‌ట‌.

ఇంకా బ‌య‌ట‌కు చెప్ప‌లేదు కానీ ఇప్ప‌టికే లీక్ రూపంలో బ‌య‌ట‌కొచ్చింది. దీంతో వెంక‌టేష్ ఫ్యాన్స్ కోపంలో ఉన్నారు. త‌మ బ్యాన‌ర్ నుంచి గేమ్ ఛేంజ‌ర్ లాంటి పాన్ ఇండియా సినిమా వ‌స్తున్న‌ప్పుడు మ‌రో రెండు రోజుల గ్యాప్ లో వెంకీ సినిమాను తీసుకురావ‌డం ఎంత‌వ‌ర‌కు క‌రెక్టనే ఆలోచ‌న‌తో దిల్ రాజు ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని టాక్. కానీ వెంకీ సినిమాకు అస‌లే టైటిలే సంక్రాంతికి వ‌స్తున్నాం(sankranthiki vasthunnam).. కాబ‌ట్టి ఇప్ప‌టికిప్పుడు ఈ సినిమా విష‌యంలో ఎవ‌రు త‌ప్పుకుంటారు? ఎవ‌రు పోటీలో ఉంటార‌నేది చెప్ప‌డం క‌ష్టం. ఒక‌వేళ నిజంగా దిల్ రాజు సినిమాను వాయిదా వేద్దామంటే వెంకీ(venky) మీ ఇష్టం అంటాడు త‌ప్పించి ప‌ట్టు బ‌ట్టి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మాత్రం అనుకోడు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :