Mokshagna: లక్కీ డైరెక్టర్‌తో మోక్షజ్ఞ రెండో సినిమా
నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మోక్షజ్ఞ(Mokshagna) డెబ్యూ మూవీ ప్రశాంత్ వర్మ(Prasanth Varma)తో ఇప్పటికే అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. యాక్షన్ కం ఫాంటసీ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. గతంలో చూసిన దాని కంటే మోక్షజ్ఞ ఇప్పుడు చాలా బాగా కనిపిస్తుండటంతో అందరికీ మోక్షుపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే మోక్షజ్ఞతో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. మోక్షజ్ఞ రెండో సినిమా లాక్ అయినట్లు తెలుస్తోంది. లక్కీ భాస్కర్(Lucky Baskhar) ఫేమ్ వెంకీ అట్లూరి(Venky Atluri) దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్(sithara entertainments) ఓ భారీ సినిమాను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సితార బ్యానర్ లో బాలయ్య(Balayya) డాకు మహారాజ్(Daku Maharaj) చేస్తున్న టైమ్ లోనే నిర్మాత నాగవంశీ(Naga vamsi) బాలయ్యకు వెంకీతో నెరేషన్ ఇప్పించాడట.
అప్పటికే బాలయ్య లక్కీ భాస్కర్ సినిమా చూసి ఉండటం, దానికి తోడు వెంకీ చెప్పిన కథ బాలయ్యకు నచ్చడంతో సానుకూలంగా స్పందించి ఫుల్ వెర్షన్ రెడీ చేసుకోమని చెప్పినట్టు సమాచారం. ఇప్పట్లో అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఈలోపు వెంకీ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకునే అవకాశముంది. మోక్షు తెరంగేట్రమే ఆలస్యమైన నేపథ్యంలో వరుస పెట్టి సినిమాలు చేయాలన్న ఆలోచనతో బాలయ్య కుదిరినప్పుడల్లా మోక్షజ్ఞ కోసం కథలు వింటున్నాడు.