ASBL Koncept Ambience
facebook whatsapp X

యాక్ట‌ర్ గా ఫెయిల్ అయిన డైరెక్ట‌ర్

యాక్ట‌ర్ గా ఫెయిల్ అయిన డైరెక్ట‌ర్

ఏదో అవుదామ‌ని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి చివ‌ర‌కు మ‌రేదో అవుతుంటారు చాలా మంది. యాక్ట‌ర్ అవాల‌నుకుని డైరెక్ట‌ర్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. అందులో వెంకీ అట్లూరి(Venky Atluri) ఒక‌డు. జ్ఞాప‌కం సినిమాతో హీరోగా ప‌రిచ‌యమైన వెంకీ(Venky) ఆ త‌ర్వాత స్నేహ గీతం(Sneha Geetham) సినిమాలో ఓ పాత్ర చేశాడు. ఆ త‌ర్వాత అత‌ను సినిమాల్లో క‌నిపించింది లేదు.

దానికి కార‌ణం ఆ త‌ర్వాత వెంకీ రైట‌ర్ గా మార‌డ‌మే. కేరింత(Kerintha) సినిమాకు రైట‌ర్ గా ప‌ని చేసిన వెంకీ తొలిప్రేమ(Tholi Prema) సినిమాతో డైరెక్ట‌ర్ గా మారాడు. ఆ మూవీ హిట్ అవ‌డంతో డైరెక్ట‌ర్ గా త‌న జ‌ర్నీని కంటిన్యూ చేస్తూ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ గా పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా దుల్క‌ర్ స‌ల్మాన్(Dulquer Salman) తో చేసిన ల‌క్కీ భాస్క‌ర్(Lucky Baskhar) సినిమా రిలీజై హిట్ దిశ‌గా దూసుకెళ్తుంది.

దీంతో చిత్ర యూనిట్ ల‌క్కీ భాస్క‌ర్ స‌క్సెస్ మీట్‌ను నిర్వ‌హించ‌గా ఆ ఈవెంట్ కు చిత్ర బృందంతో పాటూ నాగ్ అశ్విన్(Nag Ashwin), హ‌ను రాఘ‌వ‌పూడి(Hanu Raghavapudi) కూడా వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వెంకీ అట్లూరి ఓ నిజాన్ని బ‌య‌ట‌పెట్టాడు. తాను న‌టుడిగా ఉన్న‌ప్పుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి(Chandra Sekhar Yeleti) మూవీ కోసం అప్పుడు అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న హ‌ను రాఘ‌వ‌పూడి(Hanu Raghavapudi)కి ఆడిష‌న్ ఇచ్చాన‌ని, త‌ర్వాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్(Life Is Beautiful) మూవీ కోసం అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ఉన్న నాగ్ అశ్విన్(Nag Aswin) కు ఆడిష‌న్ ఇచ్చాన‌ని అలాంటి వారితో ఇప్పుడు స్టేజ్ షేర్ చేసుకోవ‌డ‌మే కాకుండా తాము ముగ్గురం దుల్క‌ర్ తో సినిమా చేసి హిట్ అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. అయితే వెంకీ యాక్ట‌ర్ గా ఫెయిల్ అయిన‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ గా మాత్రం మంచి స‌క్సెస్ అందుకుంటున్నాడు.  

 

 

praneet praneet praneet ASBL Landmark Radhey Skye Radha Spaces
Tags :