ASBL Koncept Ambience
facebook whatsapp X

Vettaiyan OTT: అప్పుడే ఓటీటీలోకి రజినీ వెట్టయన్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా? 

Vettaiyan OTT: అప్పుడే ఓటీటీలోకి రజినీ వెట్టయన్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా? 

సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ (Jailer movie) మూవీ తర్వాత ఫుల్ స్పీడులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన నటించిన వెట్టయన్ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో చిత్రానికి ఆవరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ తమిళ్లో మాత్రం మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే తాజాగా చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా భారీగా దెబ్బతినింది. అందుకే ఈ చిత్రాన్ని అనుకున్న సమయం కంటే ముందుగానే ఓటీటీలోకి (Vettaiyan OTT) తీసుకురాబోతున్నారని టాక్ నడుస్తోంది. 

జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా నిర్మాణ సారథ్యం వహించింది. థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మొదటి వారం కలెక్షన్స్ దంచి కొట్టింది. అయితే త్వరలో ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్ జైలర్ చిత్రానికి సంగీతం అందించిన అనిరుధ్ ఈ మూవీలో కూడా మ్యూజిక్ ని ఓ లెవెల్ లో ఇరగదీసాడు.

ఈ మూవీలో రజినీకాంత్ (Rajinikanth)విభిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకులను నేర్పించారు. వినూత్నమైన కథతో భావోద్వేగాలతో ముందుకు సాగే ఈ యాక్షన్ చిత్రంలో రజిని నటించడానికి వయసుతో సంబంధం లేదు అని మరొకసారి ప్రూవ్ చేశారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటివరకు తమిళనాడులో సుమారు 86 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 240 కోట్లకు పైగాని బాక్సాఫీస్ వద్ద రాబట్టింది.

ఈ మూవీ ఆన్లైన్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్ (Amazon prime) మంచి ఫ్యాన్సీ రేట్ కి సొంతం చేసుకుంది. జైలర్ చిత్రం తర్వాత రజని మార్కెట్ ఫుల్ స్వింగ్ లో ఉంది అందుకే ఈ మూవీ ఆన్లైన్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం అమెజాన్ సుమారు 90 కోట్ల వరకు ఖర్చు పెట్టింది. ఇక ఈ మూవీ అమెజాన్ ఓటీటీ (Amazon OTT) ప్లాట్ ఫామ్ లో నవంబర్ 7 నుంచి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా అమెజాన్ విడుదల చేయనుంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :