ASBL Koncept Ambience
facebook whatsapp X

రివ్యూ : ‘వేట్టయన్  ది హంటర్’ (వేటగాడు) మాస్ మెసేజ్ మూవీ

రివ్యూ : ‘వేట్టయన్  ది హంటర్’ (వేటగాడు) మాస్ మెసేజ్ మూవీ

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడ‌క్ష‌న్స్‌
న‌టీన‌టులు: ర‌జినీకాంత్‌, అమితాబ్ బ‌చ్చ‌న్‌, మంజు వారియ‌ర్‌, ఫాహ‌ద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషారా విజ‌య‌న్ త‌దిత‌రులు
సంగీతం : అనిరుద్ ర‌విచంద‌ర్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఎస్‌ఆర్‌ క‌దిర్‌
ఎడిట‌ర్‌: ఫిలోమిన్ రాజ్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: కే క‌దిర్‌
ఫైట్స్ : అన్బ‌రివు, కొరియోగ్రఫి: దినేష్‌
నిర్మాత: సుభాస్క‌ర‌న్‌, ద‌ర్శ‌క‌త్వం: టీజే జ్ఞాన‌వేల్‌
విడుదల తేదీ : 10.10.2024

ఈ మధ్య తెలుగు లో విడుదలైన తమిళ్ చిత్రాల టైటిల్స్ మనది కానీ భాషలో ఇక్కడకూడా అదే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్  రజిని కాంత్ హీరోగా ‘వేట్టయన్ ది హంటర్’ కూడా తెలుగు టైటిల్ కాకుండా అన్నిభాషల్లో ఒకే టైటిల్ తో విడుదల చేసారు. మర్డర్, రెఫ్ లాంటివి జరిగినప్పుడు చట్టబద్ధమైన దర్యాప్తు తరువాతే దోషిల్ని శిక్షించాలి. ఎన్‌కౌంటర్ పేరుతో అమాయకులు బలి కాకూడదని చెప్పే సందేశాత్మక చిత్రమే వేట్టయన్  మూవీ. ఎడ్యుకేషన్ సిస్టమ్‌పై సందేశాత్మకంగా రూపొందిన  చిత్రమే వేట్టయన్ దసరా పండుగ పూట ఇన్వెస్టికేటివ్ థ్రిల్లర్‌ను అందించారు వేట్టయాన్.సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి ఏసియన్ సునీల్, దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసారు. మరి ఈ సినిమా సమీక్ష ఎలా ఉందో లో చూద్దాం.

కథ :

సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అథియన్ (రజనీకాంత్) ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. డిపార్ట్‌మెంట్‌లో ఇతన్ని వెట్టయాన్ (వేటగాడు-హంటర్)‌గా పిలుస్తుంటారు. తప్పు చేసినోడు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షిస్తూ ఉంటాడు. గురి పెడితే ఎర పడాల్సిందే అన్న నైజంతో క్రిమినల్స్ ఆటకట్టించే అథియాన్‌కి గవర్నమెంట్ స్కూల్ టీచర్ శరణ్య‌ (దుషార విజయన్) ఓ క్లిష్టపరిస్థిలో పరిచయం అవుతుంది.తను పనిచేసే ఊరిలో డ్రగ్స్ మాఫియా బాగోతాన్ని బయటపెట్టి.. అథియాన్ (ఫహద్ ఫాసిల్) మన్ననలు పొందుతుంది శరణ్య. ఆ తరువాత చెన్నైకి ట్రాన్స్ఫర్ అయిన శరణ్యను స్కూల్‌లోనే అత్యంత దారుణంగా రేప్ చేసి చంపేస్తారు. అయితే శరణ్య కేసులో నిందితుడ్ని పట్టుకోవడంలో పోలీసు, ప్రభుత్వ వ్యవస్థలు విఫలం కావడంతో.. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ కేసుని అథియాన్‌కి అప్పగిస్తారు.  

సుప్రీం కోర్టులో పనిచేసే న్యాయమూర్తి సత్యదేవ్ బ్రహ్మదత్ పాండే (అమితాబ్ బచ్చన్) మానవ హక్కులను పరీక్షిస్తుంటాడు. చెన్నైలో ఓ కీలక కేసు దర్యాప్తు ఎస్పీ హరీష్ కుమార్ (కిషోర్), ఏఎస్పీ రూపా (రితికా సింగ్) ఓ సిట్‌ను ఏర్పాటు చేస్తారు. కానీ అథియన్ ఆ కేసులోకి వచ్చి గుణ అనే నిందితుడిని ఎన్ కౌంటర్ చేస్తాడు. చెన్నైలో పోలీసులకు సవాల్‌గా నిలిచిన నేర సంఘటన ఏంటి? నేరంలో నిందితుడు ఎవరనే విషయంపై సిట్ చేసిన దర్యాప్తు ఏమిటి? సిట్‌లోకి అథియన్‌ను ఎందుకు వచ్చాడు. తమిళనాడును కుదిపేసిన సంఘటనలో నిందితుడిని అథియన్ ఎన్‌కౌంటర్ చేసిన తర్వాత ఏం జరిగింది? సత్యదేవ్, ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు అయిన అథిమన్‌ను సత్యదేవ్ ఎలా తప్పుపట్టాడు. అథియన్ మధ్య విభేదాలకు దారి తీసిన ఆ కేసు ఏమిటి? తాను చేసిన ఎన్‌కౌంటర్‌ విషయంలో అథియన్ ఎందుకు ప్రాయశ్చిత్తం చెందాల్సి వచ్చింది? ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్‌, కోర్టు డ్రామాలో నటరాజ్ (రానా దగ్గుబాటి) క్యారెక్టర్ ఏంటి? ఈ కేసులో డీజీపీ శ్రీనివాస్ (రావు రమేష్) పాత్ర ఏంటి? అథియన్ చేసిన ఎన్ కౌంటర్ సరైనదేనా? ఎన్ కౌంటర్ అధియన్ జీవితాన్ని ఎలా కుదిపేసింది? ఆనే ప్రశ్నలకు సమాధానమే మిగతా  సినిమా కథ.

నటీనటుల హావభావాలు :

సూపర్‌ స్టార్‌ రజిని కాంత్ కి  ఓ రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చారు. ఎక్కడ కూడా రజినీ మార్క్ స్టైల్ మిస్ కాలేదు.. యాక్షన్‌లో పస తగ్గలేదు. ఏజ్ పెరిగినా తనలో  ఏ మాత్రం గ్రేస్ తగ్గలేదనిపించారు. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రజెన్స్‌ అదిరిపోయింది. అమితాబ్ పాత్రని కూడా చాలా హుందాగా చూపించారు దర్శకుడు. ఇక కేసు క్లోజ్ అనుకున్న తరుణంలో అసలు దోషిని పట్టించే పాత్రలో అమితాబ్ మెరిశారు. అయితే రజినీ-అమితాబ్ ముఖాముఖిగా ఎదురుపడే సన్నివేశాలు అంత బలంగా లేవు. ఫహద్ ఫాసిల్ పాత్రను విలక్షణంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. బాలనేరస్థుడిగా పెరిగిన బ్యాటరీలో ఉన్న టెక్ తెలివితేటల్ని అస్త్రంగా ఉపయోగిస్తుంటాడు అథియాన్. కామెడీ టైమింగ్ కూడా అదిరింది. బాగా నవ్వించాడు.. చివర్లో ఏడిపించాడు. అందరి కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు ఫహద్ ఫాసిల్. పాత్ర చిన్నదైనా అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదో చూపించాడు ఫహద్ ఫాసిల్. సర్పట్టా చిత్రంలో మరియమ్మ‌గా అద్భుత పాత్రలో నటించిన దుషార విజయన్‌ ఈ సినిమాలో గవర్నమెంట్ స్కూల్ టీచర్ శరణ్య‌గా కీలకపాత్రలో కనిపించింది. రేపిస్ట్ చేతిలో దారుణంగా చనిపోయే సీన్‌లో కళ్లు చెమ్మగిల్లేట్టు చేసింది. ప్రతినాయకుడిగా రానా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. రజినీ-రానాలు ఎదురుపడే సీన్లు ఫ్యాన్స్‌లో ఊపు తెచ్చినా నాటకీయంగా అనిపిస్తాయి. యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న రజినీకాంత్ భార్యగా మంజు వారియర్ మెప్పించింది. చివరిలో ఒక మాస్ ఎలివేషన్ సీన్‌తో క్రాక్ మూవీ లోని   శృతిహాసన్‌ని గుర్తు చేసింది. రజినీకాంత్ టీంలో యువ పోలీస్ అధికారినిగా రితికాసింగ్ మెప్పించింది. యాక్షన్ సీన్స్‌కి బాగా సెట్ అయ్యింది. కిషోర్, రోహిణి, రావు రమేష్‌ పాత్రలు మెప్పించాయి.

సాంకేతిక వర్గం పనితీరు:

జ్ఞానవేల్ దర్శకత్వంలో వచ్చిన జై భీమ్ చిత్రంలో కథే హీరో. సూర్య అందులో ఒక పాత్ర మాత్రమే. ఈ సినిమాలో కూడా దర్శకుడు జ్ఞానవేల్ సామాజిక అంశాన్ని లేవనెత్తి.. రజినీకాంత్ స్టార్ డమ్‌‌కి పదునుపెట్టారు. కమర్షియల్ మూవీ గా కనిపించినా ఇది కేవలం రజినీకాంత్‌కి సూటయ్యే కథను చెప్పారు జ్ఞానవేల్. తెలంగాణలో జరిగిన దిశ కేసు.. మలయాళ చిత్రం జనగణమన చిత్రాలను మిళితం చేసినట్టుగా అనిపిస్తుంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ సినిమాకి మేజర్ హైలైట్. నిలబెట్టింది. నాలుగు పాటలలో మనసిలాయో, హంటర్ వంటార్ ప్రత్యేకంగా నిలుస్తాయి. రజినీకాంత్ ఎలివేషన్స్ సీన్లకు అయితే అనిరుధ్‌కి పూనకం వచ్చినట్టు బాదిపారేశాడు. అయితే ఎలివేషన్స్ సీన్‌లకు ఇచ్చినంతగా.. భావోద్వేగాల సన్నివేశాలకు  సరైన ఆర్ఆర్ లభించలేదు. అక్కడ  డెప్త్ అవసరం అవసరం అనిపిస్తుంది. జ్ఞానవేల్ డైరెక్షన్‌కి కదిర్ సినిమాటోగ్రఫీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ముఖ్యంగా రజినీకాంత్‌ని ఓ రేంజ్‌లో చూపించారు ఎస్ఆర్ కదిర్. 

విశ్లేషణ :

సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకి మైనస్ అయింది. పైగా కథను ఎలివేట్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీరియస్ ట్రీట్మెంట్ ల్యాగ్ లేకుండా, ఇంకా ఎమోషనల్ గా ఉండి ఉంటే బాగుండేది.అయితే, దర్శకుడు రాసుకున్న మెయిన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఇన్విస్టిగేషన్ సీన్స్ చాలా స్లోగా ఉండటం, అలాగే సెకండాఫ్ ఆసక్తికరంగా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలు గా నిలిచాయి. అలాగే, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని బోరింగ్ సీన్స్ ను కూడా తగ్గించుకోవాల్సింది. అయితే పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాకెడ్ తో పక్కా క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ ‘వేట్టయన్’ సినిమాలో రజనీ స్టైల్ అండ్ యాక్టింగ్ తో పాటు యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ కంటెంట్ సినిమాలో హైలైట్ గా నిలిచాయి.  వేట్టయన్‌లో మంచి సందేశంతో పాటు ఎమోషన్స్ కూడా వున్నాయి. రజినీ ఫ్యాన్స్‌కి అయితే దసరా పండగే. ఈ పండక్కి వేట్టయాన్ సినిమా పక్కాగా నిలబడుతుంది.    


 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :