ASBL Koncept Ambience
facebook whatsapp X

ర‌జినీ చెప్పిన టైమ్‌కు వ‌స్తాడా?

ర‌జినీ చెప్పిన టైమ్‌కు వ‌స్తాడా?

జైల‌ర్ హిట్ త‌ర్వాత ర‌జినీకాంత్ హీరోగా వ‌స్తున్న వేట్ట‌యాన్ సినిమాపై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా అక్టోబ‌ర్ 10న రిలీజ్ కానున్నట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. రిలీజ్ కు మరో నాలుగు వారాలు మాత్ర‌మే టైముంది. కానీ ఇప్ప‌టికీ మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేయ‌క‌పోగా రిలీజ్ డేట్ గురించి మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చింది కూడా లేదు.

టీజీ జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీని అక్టోబ‌ర్ 10న రిలీజ్ చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ కొన్ని టెక్నిక‌ల్ ఇష్యూస్ వ‌ల్ల సినిమా రిలీజ్ అయ్యేనా అనే డౌట్స్ వ్య‌క్తమ‌వుతున్నాయి. ఈ సినిమా కోసం ఎంతో మంది చాలా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు వేట్ట‌యాన్ నుంచి ఒక్క సాంగ్ కూడా రిలీజ్ కాలేదు.

పైగా నిర్మాణ సంస్థ నుంచి ఈ మ‌ధ్య ఒక్క అప్డేట్ కూడా రాక‌పోవ‌డంతో వేట్ట‌యాన్ రిలీజ్ పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అందుకే వేట్ట‌యాన్ రిలీజ్ డేట్ విష‌యంలో మేక‌ర్స్ త్వ‌ర‌గా ఏదొక క్లారిటీ ఇవ్వాల‌ని రజినీ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో అమితాబ్, ఫ‌హ‌ద్ ఫాజిల్, రానా, రితికా సింగ్, మంజు వారియ‌ర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :