ASBL NSL Infratech
facebook whatsapp X

ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తుఫాన్"

ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "తుఫాన్"


హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు మేకర్స్ ఈ రోజు ప్రకటించారు.

తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ఓ దీవి నేపథ్యంగా సాగే ఈ సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. "తుఫాన్" సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు కూడా ఇదే పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు మూవీ టీమ్.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :