మరోసారి దొరికిపోయిన విజయ్- రష్మిక
గీత గోవిందం(geetha govindam) సినిమాలో నటించే టైమ్ కు హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) తన మొదటి సినిమా హీరో, నిర్మాత రక్షిత్ శెట్టి(Rakshith Shetty)తో లవ్ లో ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆ సినిమా పూర్తయ్యే టైమ్ కు రష్మిక రక్షిత్ కు బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత నుంచి రష్మిక, విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో రిలేషన్ లో ఉన్నట్లు బాగా ప్రచారం కూడా జరిగింది.
గీత గోవిందం, డియర్ కామ్రేడ్(Dear Camrade) సినిమాల్లో వీరిద్దరి కెమిస్ట్రీ చూసినా, బయట వారిద్దరూ కలవడం చూసిన ఎవరికైనా వారిద్దరూ రిలేషన్ లో ఉన్నట్ల అనిపిస్తుంది. అయినా వీరిద్దరూ ఇప్పటివరకు ఎప్పుడూ తమ రిలేషన్షిప్ ను తమంతట తాముగా బయటపెట్టింది లేదు. ఇన్‌డైరెక్ట్ హింట్స్ ఇస్తూ ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్పించి ఎక్కడా తమ బంధాన్ని రివీల్ చేయలేదు.
వారిద్దరూ వేర్వేరుగా ఫోటోలు దిగి పోస్ట్ చేసినప్పటికీ ఆ ఫోటోలు ఒకే చోట తీసినవని నెటిజన్లు ఎప్పటికప్పుడు డాట్స్ కనెక్ట్ చేసి ప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇలా గతంలో చాలా సార్లు జరగ్గా ఇప్పుడు మరోసారి వీరిద్దరూ దొరికిపోయారు. రష్మిక తాజాగా ఓ రెస్టారెంట్ లో ఫుడ్ తింటున్న ఫోటోను షేర్ చేసింది. తర్వాత ఎవరో రష్మిక ఎదురుగా విజయ్ కూర్చున్న ఫోటోను తీసి నెట్టింట పోస్ట్ చేశారు. దీంతో మరోసారి ఈ జంట బంధం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి వీరిద్దరూ ఇలా ఎన్నాళ్లు తమ ప్రేమ గురించి దోబూచులాడుతారో చూడాలి.