ASBL Koncept Ambience
facebook whatsapp X

విజ‌య్ జాగ్ర‌త్త మామూలుగా లేదుగా

విజ‌య్ జాగ్ర‌త్త మామూలుగా లేదుగా

ఫ్యామిలీ స్టార్ తో ఊహించ‌ని ఫ‌లితాన్ని అందుకున్న‌ప్ప‌టికీ కాన్ఫిడెన్స్ ను కోల్పోకుండా త‌న త‌ర్వాతి సినిమా కోసం మ‌రింత స్ట్రాంగ్ అవుతున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌స్తుతం జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి  ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజ‌య్. ఈ సినిమాపై ఆడియ‌న్స్ లో మంచి అంచ‌నాలే ఉన్నాయి.

విజ‌య్ కెరీర్లో 12వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో అత‌ను రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలో కానిస్టేబుల్ క్యారెక్ట‌ర్ చాలా స్పెష‌ల్ గా ఉండ‌నుంద‌ట‌. దీంతో పాటూ ఖైదీగా కూడా విజ‌య్ ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఈ పాత్ర‌లో విజ‌య్ న‌ట విశ్వ‌రూపం చూస్తార‌ని యూనిట్ స‌భ్యులంటున్నారు.

ఖైదీ లుక్ కోసం విజ‌య్ చాలా స్పెషల్ గా మేకోవ‌ర్ చేస్తున్నాడు. అందుకు సంబంధించిన పోస్ట‌ర్ ఇప్ప‌టికే రిలీజై ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే విజ‌య్ బ‌య‌టెక్క‌డ క‌నిపించినా కూడా ప్ర‌స్తుతం టోపీతో క‌నిపిస్తూ త‌న హెయిర్ స్టైల్ విష‌యంలో సస్పెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తున్నాడు. అంతేకాదు గ‌డ్డం కూడా బాగా పెంచి క‌నిపిస్తున్నాడు. చూస్తుంటే విజ‌య్ ఏదో హై ఓల్టేజ్ క్యారెక్ట‌ర్ చేస్తున్న‌ట్లనిపిస్తుంది. మొత్తానికి త‌న లుక్ ను పూర్తిగా రివీల్ చేయ‌కుండా విజ‌య్ బాగానే జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :