ప్రేమలో ఉన్నానని ఒప్పుకున్న రౌడీ హీరో
ది ఫ్యామిలీ స్టార్(the Family star) సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ(Vijay devarakonda) నుంచి మరో సినిమా రాలేదు. దీంతో రౌడీ హీరోని బిగ్ స్క్రీన్ పై చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కు రాలేదు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాపైనప్పటికీ విజయ్ చేతి నిండా పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంత బిజీలో ఉన్న విజయ్ రీసెంట్ గా సాహిబా(Sahiba) వీడియో సాంగ్ ద్వారా ఫ్యాన్స్ ముందుకొచ్చాడు.
హీరియే(Hiriye) సాంగ్ తో ఎంతో పాపులారిటీ దక్కించుకున్న జస్లీన్(Jaslin) కంపోజ్ చేసిన సాహిబా సాంగ్ వారంలోపే 14 మిలియన్ వ్యూస్ తో విజయ్ దేవరకొండ నమ్మకాన్ని నిజం చేసింది. ఈ సాంగ్ ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ నేషనల్ మీడియాతో కొన్ని విషయాల్ని వెల్లడించాడు. తాను డేటింగ్ లో ఉన్నానని, 35 ఏళ్ల వయసులో తనను ఎవరైనా సింగిల గా ఉన్నానని ఎలా అనుకుంటున్నారని ఇన్‌డైరెక్ట్ గా తన ప్రేమ కథను బయటపెట్టాడు.
అయితే అందరూ ఎప్పట్నుంచో అనుకుంటున్న రష్మిక మందన్నా(Rashmika Mandanna) పేరును మాత్రం విజయ్ ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రేమను పొందానని, దాని అనుభూతిని ఆస్వాదించానని మాత్రమే విజయ్ వెల్లడించాడు. ఇక సినిమాల విషయానికొస్తే విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో తన 12(VD12)వ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత రాహుల్ సాంకృత్య్సన్(Rahul Sankrithyan), రవికిరణ్ కోలా(Ravi Kiran Kola) తో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ.