Vijay Devarakonda: గర్ల్ ఫ్రెండ్ సినిమాకు వాయిస్ ఇవ్వనున్న విజయ్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) , నేషనల్ క్రష్ రష్మిక(Rashmika Mandanna) మధ్య ఉన్న రిలేషన్ గురించి ఎప్పటికప్పుడు వార్తలొస్తున్నా వారు మాత్రం వాటి గురించి రెస్పాండ్ అవకుండా వేరేలా తమ బంధాన్ని బయటపెడుతున్నారు. రష్మిక టైటిల్ రోల్ పోషించిన ది గర్ల్ ఫ్రెండ్(The Girl Friend) సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ కానుంది. పుష్ప2(Pushpa2) ఈవెంట్ లో సుకుమార్(Sukumar) చెప్పింది కూడా ఈ సినిమా గురించే.
అయితే ఈ సినిమా టీజర్ ను పుష్ప2 థియేటర్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తాజా సమాచారం. ఈ టీజర్ లో రష్మిక పాత్రను, నేపథ్యాన్ని పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండతో వాయిస్ ఓవర్ చెప్పించారట. ఈ సినిమాకే విజయ్ ఎందుకు వాయిస్ ఓవర్ చెప్పాడంటే రష్మిక మొన్నా మధ్య ఓ ఈవెంట్ లో చెప్పినట్టు అది అందరికీ తెలిసిన విషయమే.
రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని, ఓ రకంగా చెప్పాలంటే దీన్ని లేడీ ఓరియెంటెడ్ మూవీ అనొచ్చు. కథ మొత్తం రష్మిక పాత్ర చుట్టూనే తిరుగుతుందని సమాచారం. పుష్ప2 తర్వాత రష్మిక నుంచి రిలీజయ్యే సినిమా ఇదే అవొచ్చు. పుష్ప2 తర్వాత రిలీజ్ కానున్న సినిమా కాబట్టి ది గర్ల్ ఫ్రెండ్‌కు మంచి బిజినెస్ జరిగే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి(Deekshith Shetty) హీరోగా నటిస్తున్నాడు.