ASBL Koncept Ambience
facebook whatsapp X

విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

రఘురామకృష్ణ రాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్‌ వేయగా, నేడు విచారణ జరిగింది. సుదీర్ఘ వాదనల అనంతరం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. వైసీపీ హయాంలో అప్పటీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విజయ్‌పాల్‌ నిందితుడిగా ఉన్నారు.
 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :