Amaravati: అమరావతి అభివృద్ధికి రూ.కోటి విరాళం
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇందిరాదేవి కుమార్తె పి.విజయలక్ష్మి (vijayalakshmi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి విరాళం అందజేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ను కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో నివాసం ఉంటున్న విజయలక్ష్మీ అమరావతి (Amaravati) నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలను ఉద్దేశంతో రూ.కోటి విరాళం ఇచ్చామని తెలిపారు. తమ తల్లి ఇందిరాదేవి పేరిట, ఆమె కోరిక నెరవేర్చేందుకు హైదరాబాద్‌లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్లు పి. విజయలక్ష్మి తెలిపారు. ఆమె త్యాగనిరతి, స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లి పేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇందిరాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా ఉన్నారు.