ASBL Koncept Ambience
facebook whatsapp X

టంపా బేలో నాట్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

టంపా బేలో నాట్స్‌ ఆధ్వర్యంలో ఘనంగా వినాయకచవితి వేడుకలు

అమెరికాలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు పరిఢవిల్లేలా చేసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమం లోనే టంపాలో నాట్స్‌ విభాగం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించింది. స్థానిక మాటా (మన అమెరికన్‌ తెలుగు అసోషియేషన్‌) తో కలిసి నాట్స్‌ తొమ్మిది రోజుల పాటు వినాయక చవితి వేడుకులను భక్తి శ్రద్ధలతో జరిపించింది. పర్యావరణ హితంగా ఈ వేడుకలు నిర్వహించి అందరి మన్ననలు పొందింది.   ముఖ్యంగా మన సంప్రదాయాలను భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించేలా ఈ వేడులకు జరిగాయి. అయ్యప్ప సోసైటీ ఆఫ్‌ టంపా లో జరిగిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తొమ్మిది రోజుల పాటు వివిధ పూజలు, హోమాలు, వ్రతాలు జరిగాయి.అదే సమయంలో సంప్రదాయ నృత్యాలు (భరతనాట్యం, కథక్‌), గానం, సంగీత ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి..ప్రత్యేకంగా సంగీతాలయ సమర్పణలు, కవిత గాన లహరి, నందలాల్‌ యూత్‌ సంగీత కచేరీలు, సాయి భజనాలు, అన్నమాచార్య కీర్తనలు. గణేష్‌ విగ్రహాల తయారీకి సంబంధించిన వర్క్‌షాప్‌లు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ పూజా విధానాల వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మికతను తెలియజేయడం ఈ వర్క్‌షాప్‌లు పాల్గొన్నవారికి ఒక ప్రత్యేక అనుభవాన్ని అందించాయి. వినాయక చవితి వేడుకల్లో ఉట్టి పోటీలు కూడా నిర్వహించారు.చిన్న పిల్లలు, పెద్దలు అందులో పాల్గొన్నారు సంప్రదాయ భోజనం అన్ని రోజుల్లో అందరికీ వడ్డించారు. ఈ వేడుకలకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి డిన్నర్‌ బాక్సులు ఉచితంగా అందించారు.

లడ్డూ వేలం 

మొదటిసారి అమెరికా చరిత్రలో, లడ్డూ వేలం ఆన్‌లైన్‌లో నిర్వహించి చరిత్ర సృష్టించారు. వేలంలో లడ్డూకు 10,116 డాలర్లు రావడం విశేషం.

ఘనంగా నిమజ్జనం

గణేశ విగ్రహాలను (కె-బార్‌ కమ్యూనిటీ, మెలోడి కాక్‌టెయిల్‌-డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌, దోస్తి బండి రెస్టారెంట్‌, తాజామార్ట్‌ రెస్టారెంట్‌) నుండి మాతా గణేశ వద్దకు తీసుకువచ్చారు. ఊరేగింపును సైబర్‌ ట్రక్‌ ద్వారా నిర్వహించి, అనంతరం నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమం కోసం తమ వంతు సహకారాన్ని అందించిన నాట్స్‌ బోర్డు ఛైర్మన్‌ ప్రశాంత్‌ పిన్నమనేని, మాటా చాప్టర్‌ ప్రెసిడెంట్‌ టాని జాను, నాట్స్‌ మాజీ ఛైర్మన్‌, నాట్స్‌ సంబరాలు 2025 కన్వీనర్‌ శ్రీనివాస్‌ గుత్తికొండ, నాట్స్‌ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరం, నాట్స్‌ బోర్డు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ మల్లాది, నాట్స్‌ కార్య నిర్వాహక కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌(ఫైనాన్స్‌/మార్కెటింగ్‌), భాను ధూళిపాళ్ల,  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ కార్యదర్శి రాజేష్‌ కాండ్రు, ట్రెజరర్‌ సుధీర్‌ మిక్కిలినేని, జోనల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌత్‌ ఈస్ట్‌  సుమంత్‌ రామినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్‌ అరికట్ల, సురేష్‌ బొజ్జా, విజయ్‌ కట్టా, కోర్‌ టీమ్‌ కమిటీ శ్రీనివాస్‌ అచ్చి, భాస్కర్‌ సోమంచి, భార్గవ్‌ మాధవరెడ్డి, అనిల్‌ అరెమండ, భరత్‌ ముద్దన, మాధవి యార్లగడ్డ,  మాలినీ రెడ్డి, సతీష్‌ పాలకుర్తి, సుధాకర్‌ మున్నంగి, ప్రసాద్‌ నేరళ్ల, రవి కలిదిండి, కిరణ్‌ పొన్నం, నవీన్‌ మేడికొండ ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :