ASBL NSL Infratech

విశ్వ‌క్ చేస్తున్న ప్ర‌యోగం మామూలుది కాదు

విశ్వ‌క్ చేస్తున్న ప్ర‌యోగం మామూలుది కాదు

ఎప్పుడూ ఒకే మూస‌లో వెళ్ల‌కుండా డిఫ‌రెంట్ గా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్టైన్ చేయాల‌ని చూస్తున్న విశ్వ‌క్సేన్ కు భారీ క‌మ‌ర్షియ‌ల్ హిట్ మాత్రం అంద‌ని ద్రాక్ష‌లానే మిగిలింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే అది కూడా నిరాశ‌నే మిగిల్చింది. సినిమా హిట్ అని సితార సంస్థ చెప్తుంది కానీ అది నిజ‌మైతే దానికి సీక్వెల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చి ఉండేది.

ఇక అస‌లు విష‌యానికొస్తే విశ్వ‌క్ న‌టిస్తున్న కొత్త సినిమా లైలా ప్రీ లుక్ ఇవాళ రిలీజైంది. జ‌స్ట్ క‌ళ్లు మాత్ర‌మే రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. వాస్త‌వానికి అమ్మాయిల గెట‌ప్ లో క‌నిపించేందుకు ఈ త‌రం హీరోలు అస‌లు ఇంట్రెస్ట్ చూపించ‌రు. సీనియ‌ర్స్ ఎంతోమంది ఈ ప్ర‌య‌త్నాలు చేశారు కానీ రాజేంద్ర ప్ర‌సాద్, న‌రేష్ మిన‌హా ఎవ‌రూ హిట్లు అందుకోలేదు.

చిరంజీవి లాంటి వారు కూడా ఏదో ఒక సాంగ్ లో లేడీ గెట‌ప్ లో క‌నిపించారు త‌ప్పించి ఫుల్ లెంగ్త్ లో క‌నిపించింది లేదు. కానీ విశ్వ‌క్ న‌టిస్తున్న లైలా అలా కాదు. ఈ సినిమాలో విశ్వ‌క్ ఎక్కువ భాగం లేడీ గెట‌ప్ లోనే క‌నిపిస్తాడ‌ట‌. డైరెక్ట‌ర్ రామ్ నారాయ‌ణ్ ఈ సినిమాను చాలా డిఫ‌రెంట్ పాయింట్ తో రాసుకున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. క‌థ‌లు దొర‌కడం క‌ష్ట‌మై, క్రియేటివిటీ త‌గ్గిపోతున్న టైమ్ లో విశ్వ‌క్ లాంటి హీరోలు ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌డం ఎంతో అవ‌స‌రం. ఈ సినిమాను నెక్ట్స్ ఇయ‌ర్ వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ చేయ‌నున్నట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :