ASBL Koncept Ambience
facebook whatsapp X

Viswam OTT update: అప్పుడే ఓటీటీ లో గోపీచంద్ విశ్వం.. ఎందులోనో తెలుసా?

Viswam OTT update: అప్పుడే ఓటీటీ లో గోపీచంద్ విశ్వం.. ఎందులోనో తెలుసా?

భారీ కట్ అవుట్ తో అంతకంటే భారీ యాక్షన్ చేస్తూ ప్రేక్షకులను బాగా మెప్పించిన నటుడు గోపీచంద్ (Gopichand) . అయితే గత కొద్దికాలంగా ఇతని ఖాతాలో సరియైన హిట్టు పడలేదు. మరోపక్క డైరెక్టర్ శ్రీను వైట్ల (Srinu Vaitla) కూడా మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్లో తాజాగా దసరా సందర్భంగా విడుదలైన చిత్రం విశ్వం( Viswam movie) . చిత్రాలయం స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ సుమారు 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది.. 

ఈ మూవీలో గోపీచంద్ తో పాటు కావ్య థాపర్‌ (Kavya Thapar) హీరోయిన్ గా నటించారు.జిషు సేన్‌గుప్తా, నరేష్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రగతి, పార్థిబన్, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్ర పోషించారు.శ్రీను వైట్ల ఖాతాలో సరియైన సక్సెస్ఫుల్ చిత్రం పడి ఇప్పటికే 10 సంవత్సరాలు గడుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా వచ్చిన బాదుషా (Badsha) చిత్రం తర్వాత మరో సినిమా చేయలేదు. ఇటు గోపీచంద్ కూడా రామబాణం(Ramabanam ) లాంటి డిజాస్టర్ తర్వాత మంచి సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరి కం బ్యాక్ మూవీ గా భావించిన విశ్వం విడుదలకు ముందు మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో మూవీకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆన్లైన్ స్ట్రీమింగ్ (Viswam online streaming) అప్డేట్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. 

విశ్వం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అమెజాన్ ప్రైమ్( Amazon prime) 12 కోట్ల రూపాయల ఫ్యాన్సీ అమౌంట్ కి కొనుగోలు చేసినట్లు. హిందీలో తెలుగు డబ్బింగ్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో గోపీచంద్ నటించిన విశ్వం మూవీ హిందీ డబ్బింగ్ రైట్స్ ని కూడా భారీగానే అమ్ముడు అయ్యాయి. మరోపక్క విశ్వం మూవీకి సంబంధించి ఓటీటీ (Viswam OTT update) విడుదల తేదీ నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. దీపావళి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతోందని టాక్ నడుస్తుండగా.. అక్టోబర్ 29 లేక నవంబర్ 3కి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే వార్త కూడా వైరల్ అవుతుంది. ఈ విషయంపై త్వరలో ఓటీటీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :