ASBL Koncept Ambience
facebook whatsapp X

విశ్వంభ‌ర టీజ‌ర్ ఎప్పుడంటే..!

విశ్వంభ‌ర టీజ‌ర్ ఎప్పుడంటే..!

భోళా శంక‌ర్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న సినిమా విశ్వంభ‌ర‌. సోషియో ఫాంట‌సీ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. యువి క్రియేష‌న్స్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తుంది. ఈ సినిమా కచ్ఛితంగా అంద‌రికీ షాకిచ్చేలా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భారీ అంచ‌నాల‌తో రూపొందుతున్న ఈ సినిమా నుంచి గ‌త నెల చిరంజీవి బ‌ర్త్ డే ను పుర‌స్క‌రించుకుని టీజ‌ర్ రిలీజ్ చేస్తార‌ని అంతా భావించారు. కానీ మేక‌ర్స్ మాత్రం కేవ‌లం ఒక పోస్ట‌ర్‌తోనే స‌రిపెట్టారు. అయితే ఇప్పుడు ఈ సినిమా టీజ‌ర్‌కు చిత్ర యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ద‌స‌రాకు విశ్వంభ‌ర మూవీ టీజ‌ర్ ను లాంచ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌.

టీజ‌ర్ తో మొద‌లుపెట్టి వ‌రుస‌గా సినిమా ప్ర‌మోష‌న్స్ ను స్టార్ట్ చేయ‌నున్నార‌ట‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 10న రిలీజ్ కానున్న ఈ సినిమా ఆంధ్రా హ‌క్కుల కోసం డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ట‌. రూ.60 కోట్ల‌కు ఈ హ‌క్కులు అమ్ముడ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని టాక్. విశ్వంభ‌ర నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ కోసం కూడా టాప్ ఓటీటీలు పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :