కడప ఎస్పీని కలిసి వివేకా హత్య గురించి వివరించిన వైఎస్ సునీత
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుదీర్ఘకాలంగా న్యాయం కోసం పోరాడుతున్న ఆయన కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి.. శుక్రవారం నాడు కడప ఎస్పీ విద్యాసాగర్‌ను కలిశారు. వివేకా హత్య కేసు గురించి ఎస్పీకి వివరించిన ఆమె.. హంతకులకు శిక్ష పడేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డి చేసిన అభ్యంతరకర పోస్టులను కూడా ఆమె ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అనంతరం, కడప నుంచి హైదరాబాద్ బయల్దేరారు. విద్యాసాగర్‌కు ముందు కడప ఎస్పీగా ఉన్న హర్షవర్ధన్ రాజును కూడా సునీత గతంలో కలిశారు. ఆగస్టు నెలలో హోంమంత్రి అనితను కలిసిన ఆమె.. ఆ తర్వాత అప్పటి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి తన తండ్రి హత్య విషయం చర్చించారు. కాగా, హోంమంత్రి అనితను కలిసినప్పుడు వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ ఉందని సునీత ఆరోపింారు. ఈ కేసులో సీబీఐ విచారణకు పోలీసుల సహకారం అందేలా చూడాలని హోంమంత్రిని కోరారు.