ASBL NSL Infratech
facebook whatsapp X

అమ్మో ఒకటో తారీకు.. మరి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి?

అమ్మో ఒకటో తారీకు.. మరి వాలంటీర్ల పరిస్థితి ఏమిటి?

ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు గడుస్తోంది ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ పై పలు రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉన్నట్టా లేనట్టా అనే డౌట్ కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన ఈ విషయంపై ఇంకా ప్రభుత్వం నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. మరొక వారం రోజుల్లో ఒకటవ తారీకు రానే వస్తుంది.. పింఛన్ల పంపిణీ వ్యవహారం తిరిగి మళ్లీ తెరమీదకు వస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందించేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జులై ఒకటవ తారీకు నుంచి గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని రంగంలోకి దింపి పెన్షన్ల పంపిణీ చేయిస్తున్నారు. వాలంటీర్ల ప్రమేయం లేకుండానే పింఛన్ల పంపిణీ సజావుగా జరుగుతుంది అన్న వాదన వినిపిస్తోంది. 

ఇక వాలంటీర్ల వ్యవస్థపై ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల ఎన్నికలకు ముందు వాలంటీర్లకు ఇచ్చే వేతనం 10000 రూపాయల వరకు చేస్తామంటూ చంద్రబాబు నాయుడు చెప్పారు. అంటే తమ ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఈ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని ఒప్పుకున్నట్టే కదా. చంద్రబాబు వేతనం ప్రకటించిన తర్వాత అప్పటివరకు వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లు కూటమిబాట పట్టారు.  వాలంటీర్లు అందరూ అనుకున్నట్టు కేవలం పింఛన్ల పంపిణీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రభుత్వ కార్యక్రమాల నుంచి ప్రజలకు అవసరమైన అనేక అంశాల వరకు తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు.

పిల్లలకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి మరెన్నో విషయాలలో వారు తమ సేవలను అందిస్తున్నారు. కరోనా సమయంలో ముందుండి ప్రజలకు సేవ చేశారు. మునిసిపాలిటీ పన్నుల దగ్గర నుంచి విద్యుత్ బిల్లుల వరకు కట్టించుకోవడంలో ముందుండి ప్రభుత్వానికి సహాయం అందించారు. కాబట్టి వీరి విషయంలో కూటమి పాజిటివ్ గానే స్పందిస్తుంది అని అందరూ ఆశిస్తున్నారు. త్వరలో ఒకటో తారీకు రాబోతున్న నేపథ్యంలో తిరిగి మరొకసారి వాలంటీర్ల ప్రస్తావన హాట్ టాపిక్ గా మారింది. ఈ నెలకైనా వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న విషయంపై స్పష్టత వస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :