ASBL Koncept Ambience
facebook whatsapp X

వార్2 తెలుగు టైటిల్ అదేనా?

వార్2 తెలుగు టైటిల్ అదేనా?

రీసెంట్ గా దేవ‌ర(Devara) సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి గొప్ప విజ‌యాన్ని అందుకున్న ఎన్టీఆర్(NTR) ఆ సినిమాతో రూ.500 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను న‌మోదు చేశాడు. దేవ‌ర త‌ర్వాత ఎన్టీఆర్ అయాన్ ముఖ‌ర్జీ(Ayaan Mukharji) ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ రోష‌న్(Hrithik Roshan) తో కలిసి వార్2(War2) సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో రీజాయిన్ అయినట్లు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. హిందీలో వార్2 పేరుతో రిలీజ‌వుతున్న ఈ సినిమా తెలుగులో వార్2: యుద్ధ భూమి(War2: Yuddha Bhoomi) అనే ట్యాగ్ తో రిలీజ్ చేయ‌నున్నార‌ట‌. యుద్ధ భూమి అనే టైటిల్ ను ఎన్టీఆర్ కోసం మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి.

ఇప్ప‌టికే ఎన్నో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో న‌టించిన తార‌క్(Tarak) న‌ట‌న వార్2 సినిమాలో నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఆగ‌స్ట్ లో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వార్2 త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్(Prasanth Neel) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కూడా వ‌చ్చేసింది.  

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :