ASBL Koncept Ambience
facebook whatsapp X

సురేంద‌ర్ రెడ్డి నెక్ట్స్ ఏంటి?

సురేంద‌ర్ రెడ్డి నెక్ట్స్ ఏంటి?

సినిమా ఇండ‌స్ట్రీలో ల‌క్ ఎవ‌రికి ఎప్పుడు ఎలా క‌లిసొస్తుందో తెలియదు. ఒక హిట్ వ‌స్తే వ‌రుస ఆఫ‌ర్లు క్యూ క‌డ‌తాయి. అదే సినిమా ఫ్లాప్ అయితే లైమ్ లైట్‌లో లేకుండా పోతారు. ఒక‌ప్పుడు స్టార్ డైరెక్ట‌ర్లుగా ఓ వెలుగు వెలిగిన ఎంతోమంది డైరెక్ట‌ర్లు ఇప్పుడు క‌నీస అవ‌కాశాలు లేక ఇబ్బంది ప‌డుతున్నారు. క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు అందుకుని మంచి పేరు తెచ్చుకున్న సురేంద‌ర్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నాడ‌నేది ప్ర‌శ్న‌గా మారింది.

మెగాస్టార్ తో సైరా న‌ర‌సింహారెడ్డి తీసి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సురేంద‌ర్ రెడ్డి టేకింగ్ ప‌రంగా బెస్ట్ అనిపించుకున్నాడు. త‌ర్వాత అఖిల్ తో ఏజెంట్ అనే పాన్ ఇండియా సినిమాను చేశాడు. కానీ ఆ సినిమా ఆయ‌న కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ గా మారింది. ఏజెంట్ వ‌ల్ల నిర్మాత‌కు దారుణ‌మైన న‌ష్టాలొచ్చాయి. సురేంద‌ర్ రెడ్డి ఇమేజ్ ను ఏజెంట్ చాలా డ్యామేజ్ చేసింది.

ఏజెంట్ ఎఫెక్ట్ సురేంద‌ర్ రెడ్డి కెరీర్ మీద ప‌డింద‌నే మాట ఇప్పుడు టాలీవుడ్ స‌ర్కిల్ లో వినిపిస్తోంది. ఏజెంట్ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో సురేంద‌ర్ రెడ్డి సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో ఈ సినిమా క్యాన్సిల్ అయింది. దీంతో కొంత గ్యాప్ తీసుకుని సురేంద‌ర్ రెడ్డి, వెంక‌టేష్ కోసం క‌థ రెడీ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. కానీ దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. దీన్నే బ‌ట్టి అర్థం చేసుకోవ‌చ్చు ఏజెంట్ ఎఫెక్ట్ సురేంద‌ర్ రెడ్డి మీద ఎంత‌లా ఉందో.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :