ASBL Koncept Ambience
facebook whatsapp X

రానా.. రామానాయుడు ఎప్ప‌డవుతాడో

రానా.. రామానాయుడు ఎప్ప‌డవుతాడో

ద‌గ్గుబాటి రానా(Daggubato Rana) అస‌లు పేరు రామానాయుడు(ramanaidu). మూవీ మొఘ‌ల్ రామానాయుడు పెద్ద కొడుకు సురేష్ బాబు(Daggubati Suresh Babu) మొద‌టి కొడుకు కావ‌డంతో రానాకు తాత పేరు పెట్టుకున్నాడు. కానీ ఆ పేరును రానాగా మార్చుకున్నాడు. రామానాయుడు అని పిలిపించుకోవాలంటే రానాకి భ‌య‌మ‌ట‌. అంతటి లెజెండ్ పేరుతో త‌న‌ని పిల‌వ‌డం ఇష్టం లేద‌ని, త‌న‌కు ఆ అర్హ‌త లేద‌ని ఆ పేరును ఓ బాధ్య‌త‌గా అనుకుని రానాగా త‌న పేరుని మార్చుకున్న‌ట్లు స్వ‌యంగా రానానే ఓ సంద‌ర్భంలో చెప్పాడు.

మ‌రి రానా రామానాయుడిగా ఎప్పుడు మార‌తాడంటే తాతలా బాగా ఫేమ‌స్ అయ్యాకే అనే మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే న‌టుడిగా ఫేమ‌స్ అయిన రానా అన్ని భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్నాడు. వైవిధ్య‌మైన కంటెంట్ సినిమాలు చేయ‌డం రానా స్పెషాలిటీ. బాహుబ‌లి(Baahubali) సినిమాతో వ‌రల్డ్ వైడ్ గా పాపుల‌ర్ అయ్యాడు రానా. కానీ అది స‌రిపోదు.

రానా సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది. రానాకు సోలో యాక్ట‌ర్ గా రూ.500 కోట్లు క‌లెక్ట్ చేయ‌గ‌ల కెపాసిటీ ఉంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అలాంటి ప్ర‌య‌త్నాలు కూడా రానా చేయ‌లేదు. స్టోరీలు వింటున్నాడు కానీ కుద‌ర‌ట్లేదు. న‌టుడిగానే కాకుండా రానా నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఈ త‌రం టాలెంట్ ను త‌న తాత‌లానే ఎంక‌రేజ్ చేస్తూ ఇత‌ర భాషల సినిమాల‌ను అనువ‌దించి నిర్మాత‌గా తెలుగు ఆడియ‌న్స్ కు అందిస్తున్నాడు. కానీ తాత‌గారి ఇమేజ్ ను మ్యాచ్ చేయ‌డానికి ఇది స‌రిపోదు. న‌టుడిగా, నిర్మాత‌గా రానా చేయాల్సింది, సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది. అప్పుడే రానా బ‌దులు రామానాయుడిగా టైటిల్స్ లో త‌న పేరు వేయించుకోగ‌ల‌డేమో.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :