టాలెంటెడ్ నటుడికి తగ్గ ప్రతిఫలమొచ్చేదెప్పుడో?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను స్టార్ట్ చేసి హీరోగా సోలో ఛాన్సులు దక్కించుకునే వరకు సత్యదేవ్(satyadev) ఎన్నో కష్టాలు పడ్డాడు. కొదమసింహం(Kodamasimham) మూవీ చూసి చేతికి గాయం చేసుకునే అమాయకత్వం నుంచి చిరంజీవి(chiranjeevi) గాడ్ ఫాదర్(God father) లో విలన్ గా నటించాడంటే అతని కెరీర్ గ్రాఫ్ ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవే స్వయంగా సత్యదేవ్‌ను నువ్వు నా మూడో తమ్ముడివి అన్నాడంటే సత్యదేవ్ అంతకంటే ప్రత్యేకంగా సాధించేదేముంటుంది?
ఇదంతా పక్కన పెడితే సత్యదేవ్ కు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. తన నుంచి రీసెంట్ గా రిలీజైన జీబ్రా(Zeebra)కు ఊహించిన రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. ఈ సినిమాకు చాలా గట్టిగా ప్రమోషన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని కూడా తీసుకొచ్చారు. ఎంతో డిఫరెంట్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ చేశారు.
ఎన్ని చేసినా సత్యదేవ్ కు మాత్రం సక్సెస్ దక్కడం లేదు. బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో వచ్చిన జీబ్రాను డైరెక్టర్ ఈశ్వర్(Eswar) క్లారిటీగా చెప్పడంలో ఫెయిలవడంతో ఈ సినిమాకు సరైన టాక్ రాలేదు. మల్టీ టాలెంటెడ్ అయిన సత్యదేవ్‌కు సరైన కంటెంట్ పడకే హిట్ దక్కడం లేదు. దానికి తోడు ఆయన పనిచేస్తున్న దర్శకులు కూడా అలానే ఉన్నారు. జీబ్రా సరిగా చెప్పగలిగి ఉండుంటే మంచి హిట్ గా నిలిచేదన్నది మాత్రం వాస్తవం.