ASBL Koncept Ambience
facebook whatsapp X

చిరూ పేరిట స్వ‌ర్ణోత్స‌వాలెప్పుడు?

చిరూ పేరిట స్వ‌ర్ణోత్స‌వాలెప్పుడు?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ(Nandamuri Bala krishna) ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా రీసెంట్ గా చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ ఆయ‌న పేరిట భారీ ఎత్తున సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ వేడుకల‌కు బాల‌య్య(Balayya) జెన‌రేష‌న్ హీరోలైన చిరంజీవి(Chiranjeevi), వెంక‌టేష్(Venkatesh) కూడా హాజ‌ర‌వ‌డంతో ఈవెంట్ మ‌రింత అట్ట‌హాసంగా జ‌రిగింది.

అయితే బాల‌య్య(balaiah) బాల నటుడిగానే ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌డం వ‌ల్ల ఈ రేర్ ఫీట్ ముందే జ‌రిగింది. మ‌రి చిరంజీవి(Chiranjeevi) పేర‌టి స్వ‌ర్ణోత్స‌వాలు ఎప్పుడు జ‌ర‌గ‌నున్నాయంటే దానికి మ‌రో నాలుగేళ్ల టైమున్న‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇప్ప‌టికి 46 ఏళ్లు పూర్త‌వుతుంది. ప్రాణం ఖ‌రీదు(Pranam Khareedhu) సినిమాతో తెరంగేట్రం చేసిన చిరూ ఆ సినిమాను 1978లో రిలీజ్ చేశాడు.

అదే సంవ‌త్స‌రం చిరూ(chiru) న‌టించిన మ‌న ఊరి పాండ‌వులు(Mana Oori Pandavulu) కూడా రిలీజైంది. చిరూ మొద‌టి సినిమాగా మ‌న ఊరి పాండ‌వులు మూవీని చెప్తుంటారు. అలా స్టార్ట్ అయిన మెగాస్టార్(Mega star) న‌ట ప్ర‌స్థానం 156 సినిమాల వ‌ర‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం చిరూ త‌న 156వ సినిమాగా విశ్వంభ‌ర(Vishwambhara) చేస్తున్న విష‌యం తెలిసిందే. చిరూకి ఈ ఇయ‌ర్ ఎంతో ప్ర‌ముఖ‌మైన ప‌ద్మ‌విభూష‌ణ్(Padma Vibhushan) కూడా వ‌చ్చింది. రీసెంట్ గా ఆయ‌న చేసిన మూవీలు, సాంగ్స్, డ్యాన్స్ మూమెంట్స్ కు గానూ గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌రల్డ్ రికార్డుల్లో(guinness book of wordl records) కూడా పేరు సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలిచాడు. అలాంటి ఆయ‌న పేరిట ఎలాంటి ఈవెంట్ చేసినా అది త‌ర‌త‌రాలు గుర్తిండిపోయేలా చేయాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :