ASBL Koncept Ambience
facebook whatsapp X

Rohith Sharma: రెండో టెస్ట్ లో రోహిత్ స్థానం ఎక్కడ...?

Rohith Sharma: రెండో టెస్ట్ లో రోహిత్ స్థానం ఎక్కడ...?

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా తో జరగబోయే రెండో టెస్టులో ఏ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అనే దానిపై ఇప్పుడు స్పష్టత రావటం లేదు. ఓపెనింగ్ స్థానంలో కేఎల్ రాహుల్ (KL Rahul), యశస్వి జైష్వాల్ ఇద్దరూ ఖరారు కావడంతో ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై ఓ అంచనా రావడం లేదు. రెండో టెస్ట్ లో కెప్టెన్ రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో  బ్యాటింగ్ చేసే అవకాశం ఉందనే ప్రచారం గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతోంది. టెస్ట్ క్రికెట్ కెరీర్ ఆరంభంలో రోహిత్ శర్మ 5, 6 స్థానాల్లోనే బ్యాటింగ్ చేశాడు.

అలాగే వైట్ బాల్ క్రికెట్ లో కూడా మిడిల్ ఆర్డర్ లోనే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత ధోని (MS Dhoni) రాకతో రోహిత్ శర్మకు ఓపెనర్ గా ప్రమోషన్ వచ్చింది. ఇక అక్కడి నుంచి రోహిత్ శర్మ కెరీర్ ఊపు అందుకుంది. ఇప్పుడు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ టెస్టుల్లో మంచి ప్రదర్శన చేయడంతో రోహిత్ శర్మ మళ్ళీ మిడిల్ ఆర్డర్ కు మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందు మూడో స్థానంలో రోహిత్ ఆడాలని భావించిన ఆ స్థానంలో శుభమన్ గిల్ మంచి టెక్నిక్ తో ఆస్ట్రేలియా మైదానాలపై గత పర్యటనలో ఆడటంతో రోహిత్ శర్మ ఐదు లేదా ఆరో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉందని సమాచారం.

మొదటి టెస్టుకు వ్యక్తిగత కారణాలతో దూరమైన రోహిత్ శర్మ ఇప్పుడు జట్టుతో కలిశాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ స్టార్ బ్యాటర్ రెండో టెస్టులో అదరగొట్టాలని భావిస్తున్నాడు. అయితే పింక్ బాల్ టెస్ట్ లో ఆస్ట్రేలియా మైదానాలపై ఆడిన అనుభవం రోహిత్ శర్మకు లేదు. దీనితో అతన్ని ఓపెనర్ గా పంపడం కంటే మిడిల్ ఆర్డర్లో పంపితే మంచి ఫలితం ఉంటుందని బాల్ కాస్త పాత పడిన తర్వాత రోహిత్ మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రెండో టెస్టులో భారత్ గెలవాలి అంటే రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ కీలకంగా మారింది. తాను ఎప్పుడు బ్యాటింగ్ కు వచ్చినా బౌలర్ల పై విరుచుకుపడే రోహిత్ శర్మ ఈసారి కచ్చితంగా సత్తా చాటాల్సి ఉంటుంది. దీనితో అతని స్థానం విషయంలో భారత జట్టు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఫ్లడ్ లైట్ ల వెలుతురులో భారత్ చాలా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్లో పింక్ బాల్ తో భారత్ ఆడగా అక్కడ మంచి ఫలితమే వచ్చింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, జైష్వాల్ ఇద్దరూ అంచనాలకు మించి మొదటి టెస్ట్ లో, ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించారు. మరి రెండో టెస్ట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి. 

 

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :