ముందు వీరమల్లునా? ఓజీనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) నుంచి రిలీజయ్యే కొత్త సినిమా ఏంటంటే నిన్నా మొన్నటి వరకు అందరూ అఫీషియల్ గా అనౌన్స్ అయిన హరిహర వీరమల్లు(harihara veeramallu) అనే అనుకున్నారు. మార్చి 28న వీరమల్లు రిలీజవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడా ప్లేస్ లోకి ఓజీ(OG)ని తీసుకురావాలని చూస్తున్నారట.
దీని వెనుక చాలా పెద్ద కథనే ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఓజీ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ సినిమాకు ఏరియాల వారీగా భారీ రేట్లు పెట్టి కొనడానికి బయ్యర్లు పోటీ పడుతున్నారు. కొన్ని సెంటర్లకు సంబంధించిన అగ్రిమెంట్లు ఇప్పటికే అయిపోయాయి కూడా. చూస్తుంటే ఓజీ ఓపెనింగ్స్ తోనే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంలా అనిపిస్తుంది.
ఓజీ సినిమాకు ఉన్నంత బజ్ వీరమల్లు సినిమాకు లేదు. ఇప్పటికే నిర్మాత ఏఎం రత్నం(AM Ratnam) ఈ సినిమాకు వందల కోట్ల పెట్టుబడిని మూడేళ్లకు మించి పెట్టాడు. పెట్టినదంతా తిరిగి రావాలంటే ఓజీని మించిన హైప్ వీరమల్లు(Veeramallu)కు రావాలి. కానీ ఆ బజ్ ను వీరమల్లు టీమ్ క్రియేట్ చేయలేకపోయింది. కాబట్టి ఏఎం రత్నం ఆలోచించి వీరమల్లు కంటే ముందు ఓజీకి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఇస్తే అది ఆయనకే ప్లస్ అయి తన సినిమాకు మంచి బిజినెస్ జరిగే ఛాన్సుంటుంది. ఓజీ బ్లాక్ బస్టర్ అయితే వీరమల్లుకి ఆటోమేటిక్ గా డిమాండ్ తో పాటూ హైప్ కూడా పెరుగుతుంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.