వైసీపీ వాళ్ల మీదే తప్ప.. అదానీతో కాదు : విప్ ఆదినారాయణరెడ్డి
జమ్మలమడుగులో అదానీ పేరు చెప్పి వైసీపీ వాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంగళవారం జరిగిన గొడవ వైసీపీ వాళ్ల మీదే తప్ప అదానీతో కాదని స్పష్టం చేశారు. అదానీ సంస్థను జమ్మలమడుకు స్వాగతిస్తున్నామన్నారు. అదానీ పేరు చెప్పుకొని వచ్చే దొంగ వైసీపీ కంపెనీలను అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు సోలార్ పరిశ్రమ ఏర్పాటుకు అదానీ సంస్థ మొగ్గు చూపుతోందని తెలిపారు. ఇంకారాని అదానీ పరిశ్రమలకు సబ్ కాంట్రాక్టర్లుగా చలామాణి అవుతూ, వైసీపీ వాళ్లు తెరిచిన దొంగ దుకాణాలనే తమ వాళ్లు అడ్డుకున్నారని వివరించారు. అదానీ గ్రూప్‌తో దగ్గరుండి పరిశ్రమలు తామే పెట్టిస్తామని, వైసీపీ అనవసర జోక్యాన్ని సహించబోమని తేల్చి చెప్పారు. అదానీ ముసుగులో రెచ్చగొట్టిన వైసీపీ నేతల వల్లే నిన్న ఘర్షణ చెలరేగిందని తెలిపారు.