ASBL Koncept Ambience
facebook whatsapp X

అదానీపై అమెరికాలో కేసు.. వైట్ హౌస్ రియాక్షన్ ఏమిటంటే..?

అదానీపై అమెరికాలో కేసు.. వైట్ హౌస్ రియాక్షన్ ఏమిటంటే..?

గౌతమ్‌ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది.సౌర విద్యుదుత్పత్తి సరఫరా ఒప్పందాలు చేసుకునేందుకు భారత్‌లో రూ.2,029 కోట్ల లంచాలు ఇచ్చారని.. ఆ సొమ్ము కోసం తప్పుడు సమాచారం ఇచ్చి యూఎస్ లో నిధులు సేకరించారని అదానీ సహా మరో 7 మందిపై కేసు నమోదైంది. దీనిపై అమెరికా అధ్యక్ష భవనం రియాక్ట్ అయింది. ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమిస్తాయని విశ్వాసం వ్యక్తం చేసింది. అదానీ లంచం కేసు మా దృష్టికి వచ్చిందన్నారు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరీన్‌ జీన్‌ పియర్‌. సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌, న్యాయశాఖనే సరైన సమాచారం ఇస్తుందన్నారు.

ఇక, భారత్‌-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలంగానే ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తాము అనేక అంశాలపై పరస్పర సహకారం అందించుకున్నాం.. మిగతా సమస్యల మాదిరిగానే ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు పరిష్కరిస్తాయని కరీన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే, అమెరికాలో నిధులు సేకరించేందుకు తప్పుడు సమాచారం ఇచ్చారని అదానీతో పాటు మరో 7 మందిపై కేసు ఫైల్ అయింది. కాగా, ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీసెస్‌ చట్టం కింద వీరందరికి హెల్ప్ చేసిన మరో ఐదుగురిపైనా కేసు నమోదైంది.

ఈ కేసులో గౌతమ్‌ అదానీతో పాటు సాగర్‌ అదానీపైనా న్యూయార్క్ అరెస్ట్‌ వారంట్లు జారీ చేసినట్లు పలు మీడియా సంస్థలు తెలిపాయి. 20 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్ల లాభాన్ని పొందేలా అధిక ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా వీరంతా ఏపీ, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :