ASBL Koncept Ambience
facebook whatsapp X

తార‌క్ నెక్ట్స్ ఎవ‌రితో?

తార‌క్ నెక్ట్స్ ఎవ‌రితో?

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు మ‌రో సినిమా వ‌చ్చింది లేదు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ షూటింగ్ లేట‌వ‌డం వ‌ల్ల లేట‌వుతూ వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ 27న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దేవ‌ర సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెరుగుతుంద‌ని ఫ్యాన్స్ ఎంతో న‌మ్మ‌కంగా చెప్తున్నారు. ఇదిలా ఉంటే దేవ‌ర సినిమా ఫ్యాన్స్ కాల‌ర్ ఎగ‌రేసేలా ఉంటుంద‌ని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఓ వైపు తార‌క్ దేవ‌ర‌ను పూర్తి చేస్తూనే మ‌రోవైపు వార్2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. వార్2లో ఎన్టీఆర్ గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తార‌క్ నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడా అని ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతుంది. ఎన్టీఆర్ త‌న త‌ర్వాతి సినిమాగా దేవ‌ర2ను చేస్తాడా లేక ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తాడా అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్నగా మారింది. ప్ర‌శాంత్ నీల్ స‌లార్2, ఎన్టీఆర్31 సినిమాల‌ను స‌మాంత‌రంగా చేస్తాడ‌ని కొంద‌రంటుంటే, స‌లార్2 ను ముందు పూర్తి చేస్తాడ‌ని మ‌రికొంద‌రంటున్నారు. ఈ నేప‌థ్యంలో తార‌క్ నెక్ట్స్ ఎవ‌రితో చేస్తాడ‌నేది చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :