Pushpa2 Climax: ఇంతకీ బీజీఎం ఇచ్చిందెవరు?
అల్లు అర్జున్(Allu Arjub) హీరోగా నటించిన పుష్ప2(Pushpa2) సినిమా మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానుంది. అడ్వాన్సు బుకింగ్స్ తోనే పుష్ప2 రూల్ చేయడం మొదలుపెట్టాడు. పుష్ప2కు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) సంగీతం అందించిన విషయం తెలిసిందే. కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు మరికొందరు వర్క్ చేశారని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవీశ్రీని ఉద్దేశిస్తూ మాట్లాడిన సుకుమార్(Sukumar), పుష్ప2 క్లైమాక్స్‌కి దేవీ అద్భుతమైన బీజీఎం ఇచ్చినందుకు లవ్ యు అని చెప్పాడు. ఇదిలా ఉంటే సామ్ సీఎస్(Sam CS) కూడా పుష్ప2 క్లైమాక్స్ కోసం వర్క్ చేసినట్లు ట్వీట్ చేయడంతో ఇప్పుడు గందరగోళం ఏర్పడింది.
వాస్తవానికి పుష్ప2 కోసం దేవీశ్రీ తో పాటూ తమన్(Thaman), శ్యామ్ సిఎస్, అజనీష్ లోక్‌నాథ్(Ajanish loknath) పేర్లు కూడా వినిపించాయి. సినిమాలో జాతర ఎపిసోడ్‌కు బీజీఎమ్ చేసినట్టు హింట్ ఇస్తూ శామ్ రీసెంట్ గా ఎక్స్‌లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు పవర్ ప్యాక్డ్ ఫైట్ సీన్స్ తో పాటూ క్లైమాక్స్ కు కూడా వర్క్ చేసినట్లు చెప్తున్నాడు. ఒకవేళ శ్యామ్ సిఎస్ క్లైమాక్స్ కు బీజీఎం ఇస్తే దేవీ ఇచ్చినట్లు సుకుమార్ ఎందుకు చెప్తాడు? మ్యూజిక్ క్రెడిట్ మొత్తం దేవీకి ఇస్తున్నారనే కారణంతో శ్యామ్ ఈ ట్వీట్ చేశాడేమో అని కొందరంటుంటే, శ్యామ్ క్లైమాక్స్ కు వర్క్ చేసినప్పటికీ చివరకు దేవీ ఇచ్చిన బీజీఎమ్‌నే ఫైనల్ చేశారేమో అందుకే సుకుమార్ దేవీ పేరు చెప్పాడని మరికొందరంటున్నారు. ఏదేమైనా ఈ విషయంలో క్లారిటీ రావాలంటే సినిమా చూసేవరకు ఆగాల్సిందే.