ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప2లో విల‌న్ల లిస్ట్ పెద్ద‌దేగా

పుష్ప2లో విల‌న్ల లిస్ట్ పెద్ద‌దేగా

మోస్ట్ అవెయిటెడ్ సినిమాగా వ‌స్తున్న పుష్ప‌2(Pushpa2) రిలీజ్ కు ప‌ట్టుమ‌ని 50 రోజులు కూడా లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లో సినిమాను డిసెంబ‌ర్ 6న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చాలా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. రిలీజ్ ముందురోజు వ‌ర‌కు సినిమాలో ఏ సీన్ ను లాక్ చేయ‌కుండా హ‌డావిడిగా ఉంటాడ‌నే పేరున్న సుకుమార్(Sukumar) మొద‌టిసారి రిలీజ్ కు రెండు నెల‌ల ముందే ఫ‌స్టాఫ్ ను లాక్ చేయ‌డంతో టీమ్ ఎంతో ఉత్సాహంలో ఉంది.

షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్స్ వేగంగా జ‌రుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా క‌థ‌, హైలైట్లు, ముఖ్య పాత్ర‌ల గురించి నెట్టింట చ‌ర్చ జ‌రుగుతుంది. పుష్ప క్లైమాక్స్ ప్ర‌కారం పుష్ప‌2లో భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్ర‌లో న‌టించిన ఫాహ‌ద్ ఫాజిలే(Fahad Fassil) ఇందులో మెయిన్ విల‌న్.

అయితే పుష్ప‌2లో ఆయ‌నొక్క‌డే విల‌న్ కాదు. కొండారెడ్డి హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకోవ‌డానికి ఆయ‌న బ్ర‌దర్స్, బామ్మ‌ర్దిని కోల్పోయినందుకు దెబ్బ తీయాల‌ని మంగ‌ళం శీను, పుష్ప‌1లో పుష్ప‌కు అనుకూలంగా క‌నిపించిన ఎంపీ పాత్ర కూడా పార్ట్ 2లో పుష్ప‌ను టార్గెట్ చేస్తుంద‌ట‌. ఇంత‌మంది ప‌వ‌ర్‌ఫుల్ విలన్ల‌ను ఢీకొట్టే క్ర‌మంలో పుష్ప క్యారెక్ట‌ర్ మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటుంద‌ని యూనిట్ స‌భ్యులు చెప్తున్నారు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :