అఖిల్- యువి ప్రాజెక్టు హోల్డ్‌కు కారణమేంటి?
ఏజెంట్(Agent) సినిమా డిజాస్టర్ అవడంతో అక్కినేని అఖిల్(Akkineni Akhil) ఇప్పటివరకు తన నెక్ట్స్ సినిమాను మొదలుపెట్టింది లేదు. ఏజెంట్ సెట్స్ పై ఉన్నప్పుడే యువి క్రియేషన్స్(UV Creations) బ్యానర్ లో అనిల్(anil) అనే కొత్త దర్శకుడితో సినిమా చేయడానికి అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు ధీర(Dheera) అనే టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించారు. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది.
ఆ సినిమా విషయంలో క్లారిటీ రాకముందే అఖిల్ వినరో భాగ్యము విష్ణు కథ(Vinaro Bhagyamu Vishnu Katha) ఫేమ్ మురళీ కిషోర్(Murali Kishore) దర్శకత్వంలో సినిమా చేయడానికి ఓకే అన్నాడు. అఖిల్ తండ్రి నాగార్జునే(Nagarjuna) ఈ కథను సెట్ చేసినట్టు సమాచారం. అయితే యువి క్రియేషన్ సినిమా ఎందుకు ఆగిందనే విషయంలో మాత్రం ఎక్కడా సరైన క్లారిటీ రాలేదు.
తాజా సమాచారం ప్రకారం నాగార్జున నిర్ణయం మేరకే అఖిల్ యువి క్రియేషన్స్ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. ఏజెంట్ తర్వాత అంత భారీ బడ్జెట్ సినిమా చేయడం మార్కెట్ పరంగా మంచిది కాదని, అందుకే నాగార్జునే స్వయంగా ఈ ప్రాజెక్టును రెడీ చేశాడని టాక్. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రానున్న ఈ సినిమా 80 కాలంలో జరిగే కథతో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమా తర్వాతే యువి క్రియేషన్స్ లో అఖిల్ సినిమా ఉంటుందా లేదా అనేదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.