ASBL Koncept Ambience
facebook whatsapp X

ఓటుకు నోటు కేసులో కేసీఆర్.. చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదు..?

ఓటుకు నోటు కేసులో కేసీఆర్.. చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదు..?

తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటనల్లో ఓటుకు నోటు కేసు ఒకటి. 2015లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఏడాదే అయింది. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా తెలంగాణలో టీడీపీకి మంచి పట్టుంది. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు బేరసారాలు నడిపింది. బీఆర్ఎస్ నేత స్టీఫెన్ సన్ ఓటు కోసం క్యాష్ ఆఫర్ చేసింది. రేవంత్ రెడ్డి ఇక్కడ అడ్డంగా దొరికిపోయారు. అయితే ఫోన్ మాట్లాడినట్లుగా చెప్తున్న చంద్రబాబు మాత్రం తప్పించుకున్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ పెత్తనాన్ని సహించలేకపోయింది అప్పటి టీఆర్ఎస్. అందుకే ఆ పార్టీని పూర్తిగా సాగనంపాలనుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలను లాగాలనుకుంది. పైగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కేంద్రంగా అప్పటి ఏపీ రాజకీయాలు, అధికార యంత్రాంగం పని చేస్తూ ఉండేది. ఇవన్నీ ఇబ్బందికరంగా భావించిన కేసీఆర్ టీడీపీని ఇరుకున పెట్టాలనుకున్నారు. వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి ఓటుకు నోటు కేసును వెలుగులోకి తెచ్చారు. ఇందులో అప్పటి కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటూ ఉంటారు.

ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఏ1గా రేవంత్ రెడ్డి, ఏ2గా ఉదయ సింహ ఉన్నారు. ఆ సమయంలో ఫోన్లో మాట్లాడింది చంద్రబాబేనని.. ఆయన పేరు కూడా చేర్చాలని వైసీపీ పట్టుబడుతోంది. ఆయన పేరు చేర్చాలంటూ ఏసీబీని అశ్రయించారు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి. అది తిరస్కరించింది. హైకోర్టుకు వెళ్లారు. మొదటి సారి ఫెయిలయ్యారు. రెండోసారి ఏసీబీని పరిశీలించాలని ఆదేశించింది హైకోర్టు. ఈ సమయంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించడంతో కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆళ్ల రామకృష్ణా రెడ్డి. ఇప్పుడు అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.

అయితే అసలు ఆ సమయంలో కేసు పెట్టింది ఏసీబీ. ఏసీబీ తెలంగాణ ప్రభుత్వం పరిధిలో పని చేస్తుంది. అయినా చంద్రబాబు పేరును ఈ కేసులో పెట్టలేదు అప్పటి కేసీఆర్ సర్కారు. ఎందుకంటే ఆయన పేరు పెడితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తుంది. ఇది మరిన్ని ఇబ్బందులకు దారితీస్తుంది. అంతేకాక.. ఆ ఫోన్ కాల్ లో చంద్రబాబు ఎక్కడా డబ్బు ప్రస్తావన తీసుకు రాలేదు. మా వాళ్లు అన్నీ చెప్పారు.. నేను చూసుకుంటా.. నేనుంటా అని మాత్రమే అన్నారు. ఇది కోర్టుల్లో నిలబడదు. అందుకే చంద్రబాబు పేరు లేకుండానే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు లేకుంటే కేసీఆరే చంద్రబాబును పేరును చేర్చేవారు. కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో తనకు తెలుసు కాబట్టి కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టేశారు. కానీ వైసీపీ మాత్రం అత్యుత్సాహంతో చంద్రబాబు పేరు చేర్చాలంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్లి బొక్కబోర్లా పడ్డారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :