ASBL Koncept Ambience
facebook whatsapp X

జగన్ చేసిన ఆ తప్పు చంద్రబాబు రిపీట్ చేస్తారా?

జగన్ చేసిన ఆ తప్పు చంద్రబాబు రిపీట్ చేస్తారా?

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు (Andhra politics) మళ్లీ పుంజుకుంటున్నాయి.. వైసీపీ నేత జగన్ (Jagan)లైన్ లోకి తిరిగి రావడంతో రాజకీయ విమర్శలు, మాటల యుద్ధాలు మళ్లీ షురూ అయ్యా అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ (YCP) ను తిరిగి కట్టడి చేయడానికి కూటమి కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రాలో అపోజిషన్ పార్టీ (Opposition party) అనేది లేదు.. 11 సీట్లకే పరిమితమైనప్పటికీ ఎంతో కొంత కూటమిని అపోస్ చేయగలిగేది జగన్ పార్టీ మాత్రమే. 

కానీ ఇప్పటికే పార్టీ నుంచి స్ట్రాంగ్ లీడర్స్ బయటకు వెళ్లిపోయారు. అయినా కానీ జగన్ (Jagan) వాళ్లతో పనిలేదు అన్నట్లే ఉన్నారు. రాజు కన్నా మొండివాడు బలవంతుడు అన్నట్టుగా జగన్ తలుచుకుంటే ఎంత మొండిపట్టు పడతారో అందరికీ తెలుసు. 2019 ఎన్నికల ఫలితాలలో ఈ విషయాన్ని అందరూ గమనించారు. ఇక నాలుగు నెలల మౌనం తర్వాత ఇప్పుడు జగన్ కూటమిపై దాడికి సిద్ధమవుతున్నారు. 

ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే గత 11 సంవత్సరాలుగా జగన్ బెయిల్ మీద ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి అని అభియోగంతో 2012 మే లో జగన్ అరెస్ట్ చేయబడ్డారు.. అనంతరం 16 నెలల పాటు ఆయన జైలుకే పరిమితమయ్యారు. 2013 సెప్టెంబర్లో జరిగే విడుదలైన జగన్ అప్పటినుంచి ఇప్పటివరకు బెయిల్ పై జీవితాన్ని గడుపుతున్నారు. ఇంత సుదీర్ఘకాలం బెయిల్ పై ఉన్న వ్యక్తిగా జగన్కు రికార్డు ఉంది.

రాజకీయంగా కూడా ఆయనపై ఈ విమర్శ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం చాలామంది చంద్రబాబు జగన్ కి ఉన్న బెయిల్ ని రద్దు చేసి ఆయన్ని జైలుకు పంపిస్తారేమో అని అభిప్రాయపడుతున్నారు. కానీ మరి కొంతమంది అప్పుడు చంద్రబాబు విషయంలో జగన్ చేసిన తప్పు ఇప్పుడు చంద్రబాబు తిరిగి చేయరు అని బలంగా వాదిస్తున్నారు. గత సంవత్సరం చంద్రబాబు అరెస్ట్ తరువాత ఒక్కసారిగా ఆంధ్రాలో ఆయనకు పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు జగన్ ని అరెస్టు చేస్తే తిరిగి అదే జరిగే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు ఆర్ఎస్కు తీసుకోకపోవచ్చు. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ తను ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీద పెడితే పార్టీపరంగా మంచిగా ఉంటుంది అని భావించేవారు కూడా ఉన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :