లక్కీ భాస్కర్ ఆ టార్గెట్ రీచ్ అవుతుందా?
మనీ క్రైమ్ ఆధారంగా తెరకెక్కిన లక్కీ భాస్కర్(Lucky Baskhar) సినిమా ఇంకా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరలేదు. సెకండ్ వీక్ లో ఎంటరయ్యే నాటికి రూ.74 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్, మంచి రివ్యూలు లభించాయి. వాస్తవానికి లక్కీ భాస్కర్ ఎప్పుడో రూ.100 కోట్లు వసూలు చేసి ఉండాల్సింది. కానీ దానికి స్పీడు బ్రేకర్లు అమరన్(Amaran), క(KA) సినిమాల రూపంలో అడ్డు పడ్డాయి.
బయోపిక్కే కదా అంత గొప్పగా ఏం ఆడుతుందిలే అని లైట్ తీసుకున్న అమరన్ అంచనాలను మించి మంచి ఫలితం అందుకుంది. ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ కనెక్ట్ అయిన విధానానికి నిర్మాతలే షాకయ్యారు. తర్వాత కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) క సినిమా కూడా అంచనాల్లేకుండా వచ్చి అద్భుతాలు క్రియేట్ చేసింది.
ఒకవేళ క సినిమా ఫ్లాప్ అయుంటే ఆ సినిమా అకౌంట్ పడిన రూ.35 కోట్ల గ్రాస్ లక్కీ భాస్కర్ కు యాడ్ అయ్యేది. కానీ క సినిమా మ్యాజిక్ చేయడంతో లక్కీ భాస్కర్ కు అనుకున్న రేంజ్ లో వసూళ్లు రాలేదు. కొన్ని మాస్ ఏరియాల్లో దుల్కర్ సల్మాన్(Dulquer Salman) లక్కీ భాస్కర్ కంటే కిరణ్ అబ్బవరం క సినిమాకే ఎక్కువ ఓటేశారు. మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో లక్కీ భాస్కర్ రూ.100 కోట్ల మైలు రాయిని త్వరగా చేరుకోలేకపోయింది. మరి ఈ టార్గెట్ ను చేరుకోవడానికి లక్కీ భాస్కర్ కు ఎంత టైమ్ పడుతుందో చూడాలి.