కల్కి, దేవరకు లేనిది పుష్ప2కు జరుగుతుందా?
డిసెంబర్ 5న రిలీజ్ కానున్న పుష్ప2(Pushpa2) సినిమా శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. బన్నీ(Bunny)- సుకుమార్(Sukumar) కాంబోపై ఉన్న బజ్ ట్రైలర్ ద్వారా మరింత పెరిగింది. పుష్ప1(Pushpa1) సృష్టించిన సెన్సేషన్ తో పోలిస్తే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పుష్ప2కు ఇంత క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఏపీలో సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లు పెంచే ఆలోచనలో టీమ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎలాగూ మంచి రేట్లే ఉంటాయి కానీ ఏపీలో పుష్ప2కు ఎలాంటి వెసులుబాటు ఉంటుందనేదే అసలు ప్రశ్న. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి అన్ని సినిమాలకు మంచి రేట్లు, అడిగినన్ని షోలకు పర్మిషన్స్ ఇస్తూనే ఉంది. దీంతో ఇప్పుడు పుష్ప2కు సింగిల్ స్క్రీన్ టికెట్ రేట్లను రూ.300 వరకు పెంచాలని ఏపీ ప్రభుత్వంతో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాతలు డిస్కషన్స్ చేస్తున్నారని సమాచారం.
వైసీపీ పాలనలో పుష్ప1 టికెట్ రేట్ల విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈసారి ఫేస్ చేయకూడదని మేకర్స్ ముందుగానే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కల్కి, దేవర సినిమాలకు కూడా మంచి రేట్లు ఇచ్చినప్పటికీ రూ.300 మాత్రం ఏ సినిమాకూ ఇవ్వలేదు. మరి కల్కి(Kalki), దేవర(Devara)కు ఇవ్వని ఆ ఆఫర్ ను ఇప్పుడు పుష్ప2కు ఏపీ ప్రభుత్వం కల్పిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం పుష్ప2కు ఆ వెసులుబాటు కల్పిస్తే మాత్రం ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయం.