ASBL Koncept Ambience
facebook whatsapp X

రాజా సాబ్ ఆ లిస్ట్ లో జాయిన్ అవుతాడా?

రాజా సాబ్ ఆ లిస్ట్ లో జాయిన్ అవుతాడా?

ఇండియ‌న్ సినిమాలో హార్రర్ కామెడీ(Horror Comedy) అనేది ఎవర్ గ్రీన్ జాన‌ర్. హార్ర‌ర్ మాత్ర‌మే ఉంటే ఆడియ‌న్స్ కు బోర్ కొడుతుంద‌ని దానికి కామెడీ జోడించి ఓ వైపు న‌వ్విస్తూనే మ‌రోవైపు థ్రిల్ చేస్తూ ఎంట‌ర్టైన్ చేస్తున్నారు ద‌ర్శ‌క ర‌చ‌యిత‌లు. మిగిలిన జాన‌ర్ల‌తో పోలిస్తే ఈ సినిమాల‌ను త‌క్కువ బ‌డ్జెట్‌లో పూర్తి చేయొచ్చు.

సినిమా బాగుండి క్లిక్ అయితే మాత్రం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిసి నిర్మాత‌ల‌కు అధిక లాభాలు రావ‌డం ఖాయం. అందుకే సౌత్ ఫిల్మ్ మేక‌ర్స్ ఎక్కువ ఈ జాన‌ర్ సినిమాల‌పై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు మ‌ళ్లీ హార్ర‌ర్ కామెడీ సినిమాల ట్రెండ్ మొద‌లైంది. ఈ మ‌ధ్య వ‌చ్చిన స్త్రీ2(Stree2) రూ.100 కోట్ల‌తో తీయ‌గా ఆ సినిమా ఏకంగా రూ.800 కోట్ల‌కు పైగా క‌లెక్ట్ చేసి హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ అందుకున్న హిందీ సినిమాగా రికార్డు సృష్టించింది.

అదే విధంగా రూ.30 కోట్ల‌తో రూపొందిని ముంజ్యా(Munjya) రూ.130 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇప్పుడు ప్ర‌భాస్(Prabhas) ది రాజా సాబ్(The Raja saab) కూడా ఇదే జాన‌ర్ లో రూపొందుతున్న విష‌యం తెలిసిందే. మారుతి(Maruthi) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. రీసెంట్ టైమ్స్ లో హార్ర‌ర్ కామెడీ సినిమాలు బాగా అమ్ముడ‌వుతుండ‌టంతో ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నారు. మ‌రి ది రాజా సాబ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటుందో చూడాలి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :