ASBL Koncept Ambience
facebook whatsapp X

విజ‌య్‌కు లైగ‌ర్ పాఠాలు భ‌లే ప‌నికొస్తున్నాయే!

విజ‌య్‌కు లైగ‌ర్ పాఠాలు భ‌లే ప‌నికొస్తున్నాయే!

రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ(Vijay Devarakonda) లైగ‌ర్(Liger) సినిమా కోసం ప‌డిన క‌ష్టం, తీసుకున్న జాగ్ర‌త్త‌లు అన్నీ ఇన్నీ కావు. కానీ పూరీ మేకింగ్ వ‌ల్ల ఆ సినిమా డిజాస్ట‌ర్ అయ్యి విజ‌య్(Vijay) క‌ష్ట‌మంతా బూడిద‌లో పోసిన‌ట్ల‌యింది. ఆ సినిమా రిజ‌ల్ట్ తేడా కొట్టినా అది విజ‌య్ కు మంచి లెస్స‌న్ లా మారింది. ఇప్పుడు విజ‌య్, గౌత‌మ్ తిన్న‌నూరి(Gowtham Thinnanuri) ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ సినిమాను చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం కూడా విజ‌య్ లైగ‌ర్ త‌రహాలోనే క‌ష్ట‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. సితార ఎంట‌ర్టైన్మెంట్స్(Sithara Entertainments) నిర్మిస్తున్న ఈ సినిమా గౌతమ్ తీస్తున్న కెజిఎఫ్(KGF) లాంటిద‌ని నిర్మాత నాగ‌వంశీ(Naga Vamsi) ఇప్ప‌టికే సాలిడ్ ఎలివేష‌న్స్ ఇచ్చాడు. దీంతో విడి12(VD12)లో యాక్ష‌న్ సీన్స్ బాగానే ఉండ‌నున్న‌ట్లు అర్థ‌మ‌వుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ మున్నార్ లో జ‌రుగుతుంది.

ఈ సినిమాలో ఫైట్స్ ఊచ‌కోత‌లా ఉంటాయ‌ని టీమ్ స‌భ్యులు ఊరిస్తున్నారు. జెర్సీ(Jersey) సినిమాతో ఎమోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చిన గౌత‌మ్ ఈ సినిమాలో యాక్ష‌న్ ను హైలైట్ చేయ‌నున్నాడు. లుక్ ప‌రంగా విజ‌య్ ఇందులో విభిన్నంగా క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. అయితే లైగ‌ర్ కోసం విజ‌య్ ప‌డిన క‌ష్టం ఈ సినిమాలో యాక్ష‌న్ సీన్స్ ప‌ర్ఫెక్ట్ గా రావ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని అంటున్నారు. మ‌రి ఈసారైనా విజ‌య్ క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం అందుకుంటాడో లేదో చూడాలి.  
 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :