రోహిత్, గిల్ బౌల్డ్... జైస్వాల్ తో జోడి ఎవరూ...?
ఓ వైపు న్యూజిలాండ్ తో క్లీన్ స్వీప్ ఓటమి మరువక ముందే మరోవైపు భారత్ కు ఆస్ట్రేలియా పర్యటన ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. గాయాలు, వ్యక్తిగత కారణాలతో కీలక ఆటగాళ్ళు జట్టుకు దూరం కావడం ప్రభావం చూపుతోంది. ఇప్పటికే భారత బ్యాటింగ్ లైనప్ ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు జట్టు యాజామాన్యానికి తలనొప్పిగా మారాయి. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ మొదటి టెస్ట్ కు దూరం కానున్నాడు. దీనితో బౌలర్ బూమ్రా సారధ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
ఇక యువ ఆటగాడు శుభ్‌మాన్ గిల్ కూడా మొదటి టెస్ట్ కు దూరమయ్యే అవకాశం కనపడుతోంది. ఈ తరుణంలో జైస్వాల్ తో ఓపెనింగ్ ఎవరు చేస్తారు అనేది కీలకంగా మారింది. దేవదూత్ పడిక్కల్ ను ఆస్ట్రేలియా పిలిచినా అతను ఎంత వరకు ఓపెనింగ్ చేస్తాడో చెప్పలేని పరిస్థితి. ప్రాక్టీస్ మ్యాచ్ లో సీనియర్ ఆటగాడు రాహుల్ మోచేతికి గాయం అయింది. జైస్వాల్ తో పాటు సీనియర్ ఆటగాడు ఓపెనింగ్ చేయాల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఎవరు బరిలోకి దిగుతారో జట్టు యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేకపోతోంది.
గిల్ స్లిప్స్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ఎడమ చేతికి గాయం అయ్యిందని, అతను ప్రాక్టీస్ మ్యాచ్ కు హాజరు కాలేదని జాతీయ మీడియా పేర్కొంది. దీనితో అతను ఆడతాడా లేదా అనేది క్లారిటీ రావడం లేదు. గిల్ గాయం గురించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధికారికంగా ఎటువంటి ధృవీకరణ చేయనప్పటికీ, అతను ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టుకు దూరమవుతాడని సమాచారం. గిల్ గాయపడినా... ప్రాక్టీస్ మ్యాచ్ లో 42 పరుగులు చేసాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ టెస్ట్ లో గిల్ ఇన్నింగ్స్ కీలకమైంది.
ఓ ఇన్నింగ్స్ లో రాణించలేకపోయినా మరో ఇన్నింగ్స్ లో గిల్ ప్రభావం చూపిస్తాడు. మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసిన 14 మ్యాచ్‌లలో, గిల్ 42.09 సగటుతో 926 పరుగులు చేశాడు, ఇందులో మూడు సెంచరీలు మరియు మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి, ఇందులో అత్యధిక స్కోరు 119 ఉన్నాయి. ఈ సంవత్సరం, అతను అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు, 19 ఇన్నింగ్స్ లలో 47.41 సగటుతో 806 పరుగులు చేశాడు, మూడు సెంచరీలు మరియు మూడు అర్ధసెంచరీలతో అతని అత్యధిక స్కోరు 119 నాట్ అవుట్ గా ఉంది. అలాంటి గిల్ దూరమైతే జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపవచ్చు. ఏది ఏమైనా జైస్వాల్ తో రాహుల్ ఓపెనింగ్ చేస్తాడా... యువ ఆటగాడు పడిక్కల్ ఓపెనింగ్ కు వస్తాడా అనేది స్పష్టత రావడం లేదు.