పిల్లి సంపద రూ.840 కోట్లు! ... ప్రపంచంలోనే
ఈ చిత్రంలోని పిల్లి పేరు నల. ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్న మార్జాలం. దీనికి ఇన్ స్టాలో 45 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. అతి ఎక్కువ సంఖ్యలో ఇన్‌స్టాలో ఫాలోవర్లుగా ఉన్న పిల్లిగా గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. దాని ఇన్‌స్టా పేజీ అంతా మనోహరమైన దాని ఫొటోలు, రీల్స్‌తో నిండి ఉంటుంది. క్యాట్స్.కామ్ వెబ్‌సైట్ ప్రకారం దీని నికర సంపద సుమారు 100 బిలియన్ డాలర్లు. మన కరెన్సీలో అక్షరాలా రూ.840 కోట్లు. ఒక జంతు సంరక్షణ కేంద్రంలో ఉన్న ఈ పిల్లిని వరిసిరి మేతా చిట్టిపాన్ అనే మహిళ చూసింది. దాని చిట్టి కండ్లు, ముద్దొచ్చే ముఖం చూసి మురిసిపోయిన ఆమె దానిని దత్తత తీసుకుంది. తర్వాత నల అనేక వ్యాపార ప్రకటనలతో వాణిజ్య ప్రపంచంలో కూడా ఆడుగుపెట్టింది. ద లయణ్ కింగ్ చిత్రంలో సింబా ప్రాణాన్నేహితుని పేరు నలతో ఈ పిల్లి ప్రసిద్ధి చెందింది.