అమెరికా విద్యామంత్రిగా డబ్ల్యూడబ్ల్యూఈ వ్యవస్థాపకురాలు
ప్రపంచ మల్లయుద్ధ వినోద సంస్థ (డబ్ల్యూడబ్ల్యూఈ) సహ వ్యవస్థాపకురాలు, బిలియనీర్ లిండా మెక్‌మహాన్ తన ప్రభుత్వంలో అమెరికా విద్యా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అసలు విద్యాశాఖనే రద్దు చేయాలంటూ వాదించిన ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేష పరిణామం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో, ఎన్నికల తరవాత ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే రిపబ్లికన్ పార్టీ సంఘానికి ఆమె సహాధ్యక్షురాలు. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2017`2019 మధ్య చిన్న వ్యాపారాల ప్రోత్సాహక సంస్థకు లిండా నాయకత్వం వహించారు.
Tags :