ASBL Koncept Ambience
facebook whatsapp X

మెగా బ్రదర్స్ మెగా ప్లానింగ్.. చంద్రబాబుకు ఈ వ్యూహం అర్థం అవుతుందా..

మెగా బ్రదర్స్ మెగా ప్లానింగ్.. చంద్రబాబుకు ఈ వ్యూహం అర్థం అవుతుందా..

ఆంధ్రాలో చిరంజీవి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పార్టీను పట్టాలెక్కించలేక సైడ్ అయిపోయాడు. అనంతరం రాజకీయాల్లో ఏదో సాధించాలి అని వచ్చిన పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలకు పైగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వచ్చాడు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా కూటమితో ఘన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. అనంతరం డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గత కొద్దికాలంగా తన స్ట్రాటజీలను విపరీతంగా మారుస్తున్నట్లు కనిపిస్తోంది. 

చంద్రబాబు రాజకీయ చతురత తెలుసు కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీని వెనక మెగా బ్రదర్స్ మెగా స్కెచ్ ఉంది అన్న మాట కూడా గట్టిగానే వినిపిస్తోంది. వైసిపి నుంచి వరుస వలసలలో వస్తున్న నాయకులు ఎక్కువగా టిడిపి తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన ఎక్కడ వీక్ అయిపోతుందో అని పవన్ మెల్లిగా తన స్ట్రాటజీలో మార్చడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే వైసిపి నుంచి ఇద్దరు గట్టి క్యాండిడేట్లను జనసేనలోకి చేర్చుకున్నారు. 

దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ పవర్ బాగా పెరుగుతుంది. ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరో తెలుసా.. వైయస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను జనసేనలోకి చేరడం ఆ పార్టీకి మరింత పవర్ ఇచ్చినట్లు అవుతోంది. మరి ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఉదయభాను వైసీపీని వీడి జనసేన వైపు రావడం జిల్లాలో పార్టీకి బలాన్ని చేకూరుస్తుంది. దీని వెనుక ముఖ్య ఉద్దేశం ఇప్పటివరకు 21 సీట్లకు గాను 21 సీట్లు గెలుచుకున్నారు.. ప్రస్తుతానికి కూటమి పదిలంగానే ఉంది కానీ రేపు భవిష్యత్తు ఏంటి అనే విషయం ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రాజకీయాలలో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు.. అలాగే శత్రువులు ఉండరు. రేపటి రోజున ఎటు నుంచి పోయినా.. ఏం జరిగినా తమకంటూ బలం ఉండాలి అనే ఉద్దేశంతో పవన్ ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ అందరూ ఊహించినట్టు ఏపీలో వైసిపి బలహీనపడినా.. పోటీకి రెండు ప్రాంతీయ పార్టీలు అదేనండి టిడిపి,జనసేనా మిగులుతాయి. అలాంటప్పుడు టిడిపి ముందు ఏ రకంగా తగ్గకుండా ఉండడానికి జనసేనను ఇప్పటినుంచే తయారు చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ ప్లానింగ్ పసిగడతారా లేదా అన్న విషయం తెలియాల్సి ఉంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :