ASBL Koncept Ambience
facebook whatsapp X

వైసీపీ మూడు ఎంపీ సీట్లు కూటమి ఖాతాలోకి..  అభ్యర్థులు వీరే?

వైసీపీ మూడు ఎంపీ సీట్లు కూటమి ఖాతాలోకి..  అభ్యర్థులు వీరే?


వైసీపీ (YCP) కు చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయడంతో ఆంధ్రాలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయి. తాజాగా మోపిదేవి వెంకటరమణ (mopidevi venkataramana), బీద మస్తాన్ రావు ( Beeda Masthan Rao) తో పాటు ఆర్ క్రిష్ణయ్య ( R Krishnaiah) తమ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూడు సీట్లు టీడీపీ కూటమిలోకి చేరుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో ప్రస్తుతం కూటమికి ఉన్న బలం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ మూడు సీట్లు ఎవరికి ఇస్తారు అనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

ఆంధ్ర నుంచి 11 మంది వైసీపీ ఎంపీలే ఉండడంతో టిడిపి (TDP) కి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే తనదైన శైలిలో పావులు కదిపిన టిడిపి మెల్లిగా ఆ పార్టీ నుంచి కొందరిని సైకిల్ ఎక్కిచ్చేసింది. ఎవరినైతే జగన్ నమ్మి పదవులు ఇచ్చారో వారే టోపీ పెట్టి పక్కకు రావడమే కాకుండా పదవులను కూడా వదిలేసుకున్నారు. ఈ ముగ్గురిలో ఆర్ క్రిష్ణయ్య మాత్రం సైకిల్ ఎక్కకుండా కమలం వైపు వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఆ విషయం కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న మూడు ఎంపీ సీట్లలో.. రెండు టీడీపీ కు ఒకటి జనసేనకు ఇచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ విధంగా పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాలలో తొలిసారి జనసేన పెద్దల సభలో అడుగు పెట్టబోతోంది. అయితే టిడిపి రెండు తీసుకుంటే కూటమిలో భాగమైన బీజేపీ (BJP) గమ్ముకుంటుందా లేదా అనే విషయం చూడాలి. ప్రస్తుతానికి టిడిపి తరఫున గల్లా జయదేవ్ (Galla Jayadev), అశోక్ గజపతి రాజు పేర్లు వినిపిస్తున్నాయి.

మరి జనసేనకు (Janasena )ఇస్తున్న ఎంపీ సీటులో పవన్ కళ్యాణ్ నాగబాబును పంపిస్తారు అన్న ఆకు వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబు తోలుతా అనకాపల్లి లోక్సభ నుంచి పోటీ చేయాల్సి ఉంది.. అయితే కూటమి కట్టుబాట్లకు కట్టుబడి ఆయన ఆ సీటును త్యాగం చేశారు. ఇక ఎన్నికలు పూర్తయ్యేటంతవరకు తమ్ముడికి అండగా నిలబడి ఎటువంటి పదవి ఆశించకుండా ముందుకు సాగారు. కాబట్టి అంత త్యాగం చేసిన మెగా బ్రదర్ కి ఎంపీ సీటు దక్కుతుంది అని అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ పోస్టులకు ఈ ముగ్గురు నామినేషన్లు వేయడమే కాకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ విషయంలో పార్టీ నుంచి పదవులు ఆశిస్తున్న మిగిలిన నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :