ASBL Koncept Ambience
facebook whatsapp X

YS Jagan: ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన జగన్.! అంత తొందరైతే ఎలా...!?

YS Jagan: ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయిన జగన్.! అంత తొందరైతే ఎలా...!?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో (AP Assembly Elections) పాటు దేశ సార్వత్రిక ఎన్నికలు జరిగి కేవలం నాలుగు నెలలే అయింది. అటు దేశంలో కానీ, ఇటు ఏపీలో కానీ ఎన్డీయే ప్రభుత్వాలు (NDA) ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన బీజేపీకి (BJP) ఉన్నా ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యేది కాదు. కానీ వైసీపీ (YSRCP) అధినేత జగన్ (Jagan) మాత్రం రేపోమాపో జమిలి ఎన్నికలు (Duel elections) రాబోతున్నాయని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికలొస్తున్నాయ్... సిద్ధంగా ఉండండంటూ జగన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సంస్థాగత మార్పులపై దృష్టిపెట్టింది. పలువురు నేతలు పార్టీని వీడుతుండడంతో వాళ్ల స్థానంలో కొత్త అధ్యక్షులను నియమిస్తోంది. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా పలు మార్పులు చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రస్థాయి నేతలతో ఓ వర్క్ షాప్ నిర్వహించారు జగన్. ఇందులో జగన్ పలు అంశాలపై మాట్లాడారు. అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే తాము మళ్లీ అధికారంలోకి వచ్చేవారమన్నరు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంపై నాలుగు నెలలకే వ్యతిరేకత వచ్చేసిందని.. ఈ ప్రభుత్వం మాకొద్దు బాబూ అని ప్రజలు చెప్పుకుంటున్నారని జగన్ అన్నారు. ప్రతిపక్షంలో (opposition) ఉన్నాం కాబట్టి పార్టీని బలోపేతం చేసుకునేందుకు తగిన సమయం ఉంటుందని.. రోడ్లపైకి వచ్చి పోరాడితే మంచి ఫలితాలు వస్తాయని జగన్ చెప్పారు.

అదే సమయంలో జమిలి ఎన్నికలు వస్తాయంటున్నారని అందుకోసం పార్టీ నేతలంతా సంఘటితంగా పనిచేయాలని జగన్ పిలుపునిచ్చారు. ఇప్పుడీ మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు కాకుండానే జగన్ అప్పుడే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని.. అధికారం లేకుంటే తట్టుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా జగన్ ది అత్యాశ కాకపోతే.. జమిలి ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ బీజేపీకి ఇప్పట్లో జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే ఉంటే ఇటీవల హర్యానా (Haryana), జమ్ముకాశ్మీర్ (Jammu Kashmir) ఎన్నికలు నిర్వహించేది కాదు.. తాజాగా మహారాష్ట్ర (Maharashtra), జార్ఖండ్ (Jharkhand) ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా ఇచ్చేది కాదు. దీన్ని బట్టి ఇప్పట్లో జమిలి ఎన్నికలు ఉండబోవని ఎవరికైనా ఇట్టే అర్థమవుతోంది.

ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే బీజేపీకి ఉందనుకుందాం.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు మాట కాదని బీజేపీ ఒంటరిగా ముందుకెళ్తుందా..? అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయింది.. ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాలని అటు మోదీ కానీ, ఇటు చంద్రబాబు కానీ కోరుకుంటారా..? కనీసం నాలుగేళ్లయినా అధికారంలో ఉండాలనుకుంటారు. అయినా ఎన్డీయే తీసుకున్న జమిలి ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సింది పోయి జగన్ ఏంటి స్వాగతిస్తున్నారు.. అని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఆశ పడడంలో తప్పు లేదు కానీ అత్యాశకు పోతే చివరకి ఏం మిగులుతుందో అందరికీ ఎరుకే..!!

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :