ASBL Koncept Ambience
facebook whatsapp X

YS Jagan: జగన్ ఇంకెప్పుడు రీయలైజ్ అవుతారు..!?

YS Jagan: జగన్ ఇంకెప్పుడు రీయలైజ్ అవుతారు..!?

ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) త్వరగానే మేల్కొంది. 11 సీట్లే వచ్చాయి కదా అని ఇంట్లో కూర్చుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించారు ఆ పార్టీ అధినేత జగన్ (YS Jagan). అందుకే నిత్యం జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. వాళ్లలో విశ్వానం నింపేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పటికీ తానే గొప్ప.. తన పరిపాలనే గొప్ప.. చంద్రబాబు (CBN) వేస్ట్.. అబద్దాలతో అధికారంలోకి వచ్చాడు అంటూ నెపాన్ని నెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. జగన్ ఇప్పటికీ రీయలైజ్ కాలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది.

పార్టీ వ్యవస్థాగత మార్పులు చేర్పుల్లో జగన్ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయి నేతలతో జగన్ వర్క్ షాప్ (work shop) నిర్వహించారు. ఇందులో పలు అంశాలపై ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. సంఘటితంగా పని చేయాలని సూచించారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తగినంత సమయం ఉంటుందని.. పార్టీని దేశంలోనే బలంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత వచ్చేసిందన్నారు. అబద్దాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హమీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

చంద్రబాబు లాగా తాను కూడా మళ్లీ అబద్దాలు చెప్పి ఉంటే అధికారంలోకి వచ్చేవాళ్లమని కొంతమంది చెప్తున్నారని జగన్ అన్నారు. అయితే తాను అలాంటి పని చేయనని.. అవసరమైతే మళ్లీ ప్రతిపక్షంలో (opposition) కూర్చునేందుకైనా సిద్ధమని జగన్ స్పష్టంచేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ జగన్ ఈ మాటను పదేపదే చెప్పడం ద్వారా తానేదో సుద్దపూసనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ 2019 ఎన్నికలకు (2019 elections) ముందు జగన్ అనేక అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ఎన్నో హామీలను (promises) బుట్టదాఖలు చేశారు.

2014-19 మధ్య ప్రతపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ అనేక ఆరోపణలు చేశారు. చంద్రబాబు 36 మంది కమ్మ డీఎస్పీలకు (DSP) ప్రమోషన్లు ఇచ్చారని ఆరోపించారు. అమరావతిలో (Amaravati) చంద్రబాబు వందల ఎకరాల భూములు కొన్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం (Liquor ban) అమలు చేస్తానన్నారు. అయితే దీనికి భిన్నంగా పైగా మద్యం ఆదాయాన్ని చూపించి పదేళ్లకు సరపడా అప్పులు చేశారు జగన్. ఉద్యోగులకు సీపీఎస్ (CPS) పెన్షన్ అమలుచేస్తానన్నాడు.. కానీ దాన్ని చేయలేకపోయారు.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు నమ్మింది ఒక్కటే. జనం ఖాతాల్లోకి నేరుగా డబ్బులు (DBT Scheme) వేస్తే చాలనుకున్నారు. అలా డబ్బులు వేస్తూ మిగిలినవి చేయకపోయినా పర్లేదనుకున్నారు. బటన్ నొక్కడాన్ని హైలైట్ చేసి తెరవెనుక తన సామాజిక వర్గాన్ని జగన్ పెంచి పోషించారు. ఈ విషయాన్ని జనం గ్రహించారు కాబట్టే తాజా ఎన్నికల్లో జగన్ కు దారుణమైన ఓటమిని కట్టబెట్టారు. అయినా జగన్ మాత్రం మారలేదు. ఇప్పటికే తాను చేసిందే కరెక్ట్ అనే ధోరణిలోనే ఉన్నారు. తాను అధికారంలోకి వస్తే 2019 నాటి పాలననే తీసుకొస్తానంటున్నారు. దాన్ని జనం ఛీకొట్టారనే విషయాన్ని జగన్ గ్రహించి తప్పులు సరిదిద్దుకోనంతవరకూ ఆయన అధికారంలోకి రావడం కష్టం. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :