దిశా నిర్దేశం లేక దిక్కులు చూస్తున్న వైసీపీ.. జగన్ ఇది కరెక్టేనా?
రాజకీయాలు అంటేనే గెలుపు ఓటమిలు రెండు సమానంగా తీసుకోవాలి. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే అంతటితో జీవితం అయిపోయినట్టు కాదు. కరెక్ట్ గా ప్లాన్ చేసి కొడితే వచ్చే ఎన్నికల్లో బొమ్మ రివర్స్ అవడం పెద్ద పనేమీ కాదు. అయితే జగన్ ఈ విషయాన్ని పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. అంతేకాదు తాను సైలెంట్ అవ్వడంతో పాటు పార్టీలో నేతలకు దిశా నిర్దేశం కూడా చేయడం లేదు. తాజాగా పూర్తయిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు తాను వెళ్లకుండా ఆగడమే కాకుండా మిగిలిన వాళ్ళను కూడా వెళ్ళనివ్వలేదు.
కనీసం మీడియా ముందు అన్న ఏదైనా మాట్లాడతారా అంటే అది లేకుండా పోయింది. బడ్జెట్ స్టేషన్ పై కేవలం జగన్ మాత్రమే మీడియా ముందు మాట్లాడారే తప్ప మిగిలిన పదిమంది ఎమ్మెల్యేలు ఎక్కడ నోరు విప్పిన దాఖల లేదు. అయితే ప్రస్తుతం వైసీపీ నాయకులు ఫాలో అవుతున్న ఈ సైలెన్స్ పార్టీకే పెద్ద ముప్పు తెచ్చేలా కనిపిస్తోంది. తాజాగా ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల పరిస్థితి ఏమిటి అన్న విషయంపై కూడా తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీకి మొత్తం నలుగురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో కడప నుంచి అవినాష్ రెడ్డి, అరకు నుంచి చెట్టి తనుజారాణి, తిరుపతి నుండి మద్దెల గురుమూర్తి, రాజంపేట నుంచి పీవీ మిథున్ రెడ్డి వైసీపీ తరఫున ఈ ఎన్నికల్లో గెలిచారు.
అయితే శీతాకాలం సమావేశాలలో వారు ఎటువంటి అంశాలపై చర్చించాలి? రాబోయే ఎన్నికలకు ఎటువంటి ప్రణాళికలు ఇప్పటినుంచి అవలంబించాలి అనే విషయంపై జగన్ వారితో ప్రస్తావించిన ప్రసక్తే లేదట. కనీసం పార్లమెంటరీ పార్టీ నాయకులతో ఓ చిన్ని సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. రాజ్యసభలో ఉన్న తొమ్మిది మంది సభ్యులతో కలుపుకుంటే మొత్తంగా వైసీపీ తరఫున 13 మంది ఎంపీలు ఉన్నారు.
శీతాకాల సమావేశాలకు సంబంధించి ఎటువంటి బ్రీఫ్ ఇవ్వకుండానే బెంగళూరుకి చెక్కేశాడు జగన్. మరోపక్క చంద్రబాబు మాత్రం తనకు ఉన్న 15 మందితో శనివారమే మీటింగ్ నిర్వహించారు. లోక్సభలో ఎలా వ్యవహరించాలి అన్న విషయాలను చర్చించడంతోపాటు ప్రస్తుతం సంచలనంగా మారిన జగన్, అదానీ.. హంసల పై ఎలా మాట్లాడాలి అనే విషయంపై కూడా ఈ మీటింగ్ లో చర్చలు జరిగాయట. మొత్తానికి ఈసారి పార్లమెంట్ను జగన్ కు అందిన ముడుపుల విషయం కుదిపేయబోతోంది అని అర్థమవుతుంది.