ASBL Koncept Ambience
facebook whatsapp X

త్వరలోనే జగన్ పాదయాత్ర 2.0?

త్వరలోనే జగన్ పాదయాత్ర 2.0?

ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన వైసీపీకి.. ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోంది. ఓవైపు ఎన్నికల్లో ఘోరపరాజయం.. పార్టీ నేతల వరుస జంపింగ్ లు పార్టీ అధినేత జగన్ కు కునుకు లేకుండా చేస్తున్నాయి. వీర విధేయులని నమ్మి అందలమెక్కించిన నేతలు కాస్తా.... పవర్ పోగానే, నాలుగు రాళ్లేసి మరీ అధికార పక్షం వైపు అడుగులేస్తున్నారు. దీంతో ఎవరిని నమ్మాలో.. ఎవరిని చేరదీయాలో అర్థం కానిస్థితిలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి జనాన్నే నమ్ముకోవాలని జగన్ డిసైడైనట్లు తెలుస్తోంది.

దీంతో త్వరలో జగన్ పాదయాత్ర చేపట్టనున్నారని సమాచారం. మూడు రోజుల పాటు క‌డ‌ప‌లో ప‌ర్య‌టించిన జ‌గ‌న్‌.. త‌నకు అత్యంత విశ్వ‌స‌నీయు లైన నాయ‌కుల‌తో అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు జ‌రిపారు. సొంత మేన‌మామ‌.. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి(క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గం), రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి(ప్రొద్దుటూరు), అంజాద్ బాషా(క‌డ‌ప‌) స‌హా అత్యంత ముఖ్యుల‌తో స‌మావేశమ‌య్యారు. ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌ల‌పైనే చ‌ర్చించిన‌ట్టు తెలిసింది. నిజానికి ఇప్పుడు పార్టీలో ఎవ‌రు ఉంటారో.. ఎంత‌మంది వెళ్లిపోతారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఈ నేప‌థ్యంలో పార్టీని కాపాడుకోవ‌డంతోపాటు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీకి వ‌చ్చిన 40 శాతం ఓటు బ్యాంకును కాపాడుకోవ‌డం, అదేస‌మ‌యంలో త‌న ఇమేజ్‌ను దెబ్బ‌తీయాల‌ని అనుకున్న వారికి త‌గిన విధంగా స‌మాధానం చెప్పడం అనే కీల‌క విష‌యాల‌పై జ‌గ‌న్ దృష్టి పెట్టిన‌ట్టు తెలిసింది. అవసరాన్ని బట్టి.... వ‌చ్చే నాలుగేళ్ల పాటు.. విడ‌త‌ల వారీగా జిల్లాల్లో పాద‌యాత్ర చేయాల‌ని కూడా భావిస్తు న్న‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై పూర్తిస్థాయి నిర్ణ‌యం తీసుకోలేదు. కానీ, ఇప్ప‌టికిప్పుడు మాత్రం.. ప్ర‌జ‌ల్లోకివెళ్లాల‌నినిర్న‌యించుకున్నారు. తాను ఒక్క‌డిగానే.. పార్టీని నిల‌బెట్టాన‌ని. మిగిలిన వారంతా త‌ర్వాత వ‌చ్చార‌ని.. కాబ‌ట్టి.. త‌న‌కు ఒంట‌రి త‌నం కొత్త‌కాద‌ని ఈ సంద‌ర్భంగా.. జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు విశ్వ‌సనీయ స‌మాచారం. సో.. దీనిని బ‌ట్టి.. మ‌ళ్లీ జ‌గ‌న్‌ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకే మొగ్గు చూపుతున్న‌ట్టు తెలుస్తోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :