ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆ విషయంలో జగన్ మౌనం.. అసలు కారణం ఏమిటో?

ఆ విషయంలో జగన్ మౌనం.. అసలు కారణం ఏమిటో?

గత కొద్ది రోజులుగా దివంగత నేత ..మాజీ ముఖ్యమంత్రి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల వివాదం ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అందరికీ తెలుసు. ఈ విషయంలో ఇప్పటివరకు షర్మిల తనవైపు వాదన వినిపించారు. ఇక తాజాగా విజయమ్మ కూడా తాను చెప్పదలుచుకున్నది స్పష్టం చేశారు. వీరితో పాటు ఈ విషయంలో వైవి సుబ్బారెడ్డి కూడా తన వాదన వినిపించారు. అయితే ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడుకున్నా ముగ్గురు మాటలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి.. వాళ్లే జగన్ ,షర్మిల ,విజయమ్మ..

ఈ ముగ్గురిలో ఇప్పటివరకు.. ఇద్దరు తాము ఏమనుకుంటున్నాము అన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ మాత్రం గత పది రోజులుగా ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు. అయితే మరోపక్క తాను చెప్పదలుచుకున్న మాటలు తనకు అనుకూలమైన వైవీ సుబ్బారెడ్డి, విజయ్ సాయి రెడ్డి ద్వారా మీడియాకు చేరవేస్తున్నారు అని కొందరు భావిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే అసలు విషయం తమ కుటుంబానికి సంబంధించింది కాబట్టి జగన్ ఈ విషయంపై లేఖ ద్వారా లేక నేరుగా స్పందించాలి. కానీ ఇప్పటివరకు ఈ రెండు జరగలేదు. నిన్న మొన్నటి వరకు ఈ విషయంపై విజయమ్మ స్పందించడం లేదు అని వెల్లువెత్తిన విమర్శలకు విజయమ్మ నేరుగా సమాధానం ఇచ్చేశారు. ఇక మిగిలింది జగన్ ఏం చెబుతారు అన్న విషయమే..

అయితే ఇక్కడ జగన్ వాస్తవాలు చెబుతారా? లేక తనను తాను మంచిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారా? అన్న విషయం చర్చనీయాంసంగా మారింది. మరోపక్క షర్మిల, విజయమ్మ తాము చెప్పదలుచుకున్న విషయాలను చెప్పారే తప్ప పూర్తిగా అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని చెప్పడం లేదు. ఈ నేపథ్యంలో అసలు విషయాలు తెలియాలి అంటే జగన్ స్పందించి తీరాలి. పంపిణీ జరగని ఆస్తుల విషయంలో జగన్.. డివిడెండ్ ఎలా ఇవ్వగలరు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీలైనంత త్వరగా జగన్ ఈ విషయంపై స్పందించి నిజానిజాలు కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడకపోతే ప్రజలు ఆయనపై సందేహం పెంచుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :