ASBL NSL Infratech
facebook whatsapp X

టార్గెట్ షర్మిల.. జగన్ ఫోకస్ షిఫ్ట్ అయ్యిందా..

టార్గెట్ షర్మిల.. జగన్ ఫోకస్ షిఫ్ట్ అయ్యిందా..

2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఓటమికి ముఖ్య కారణం షర్మిల పేల్చిన మాటల తూటాలు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మైకు పట్టుకున్న దగ్గరనుంచి జగన్ పై విమర్శలు చేయడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగిన షర్మిల తెలియకుండా టిడిపికి ఎంతో మేలు చేసింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా జగన్ పై ఆమె తన మాటల దాడి విరమించుకోలేదు. అన్న కేవలం 11 స్థానాలకు పరిమితమైన ఇంకా ఆమెలో ఎక్కడ సాటిస్ఫాక్షన్ కల్పించడం లేదు. ఢిల్లీలో ధర్నా చేస్తాను అని జగన్ అంటే ఎవరికోసం చేస్తున్నావు అని ఈ షర్మిల విరుచుకుపడింది. బాబాయ్ ని హత్య చేసినప్పుడు చేయని ధర్నా ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఎందుకు అని సూటిగా ప్రశ్నించింది. అధికార పక్షం పార్టీ నాయకులు కంటే కూడా షర్మిల జగన్ పై చేసే మాటల దాడి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో జగన్ కనిపించే శత్రువు కూటమి అయితే అంతఃశత్రువు షర్మిల అన్న విషయాన్ని బాగానే అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది. 

అందుకే ఇప్పుడు టార్గెట్ షర్మిల అనే కొత్త మిషన్ ని జగన్ ప్రారంభించినట్లు టాక్. చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ.. రెండు పక్కలా లాభం చేకూరేలా జగన్ వ్యవహరిస్తున్నారు అన్న అనుమానాన్ని జాతీయ మీడియా సైతం వ్యక్తం చేస్తుంది. ఢిల్లీలో జరిగిన ధర్నాకు జగన్ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి పార్టీని ఆహ్వానించడం దీనికి గల ముఖ్య కారణం. కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి అవసరమైతే నేను మీ వెంట ఉన్నాను అన్న ఇన్ డైరెక్ట్ సంకేతాలను జగన్ ఇవ్వడమే దీని ముఖ్య ఉద్దేశం అని అందరూ భావిస్తున్నారు. ఈసారి మోదీకి ధీటుగా ఇండియా కూటమి కూడా మంచి స్థానాలనే కైవసం చేసుకుంది.. భవిష్యత్తులో మరింత బలం చేకూరి అవకాశం కూడా ఉంది. అందుకే ఎన్డీఏ కూటమి ఎదుర్కోవడం కోసం జగన్ ఇప్పుడు ఇండియా కూటమితో చేతులు కలపబోతున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అంతా బాగానే ఉంది కానీ కాంగ్రెస్ బలంతో కాస్త పుంజుకుంటున్న షర్మిలకు మాత్రం ఇది గుడ్ న్యూస్ కాదు. జగన్.. షర్మిలా ఈ ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే కాంగ్రెస్ పెద్దలను నిర్ణయం ఎంత కఠినంగా ఉంటుందో అందరికీ తెలుసు. ఇండియా కూటమి కీలక నేతల ద్వారా షర్మిలను కట్టడి చేయడానికి కూడా జగన్ ఈ వ్యూహం పన్నుతున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే భవిష్యత్తులో ఏం జరుగుతుంది.. జగన్ తీసుకునే ఈ నిర్ణయాల వెనుక ఏ పరమార్థం దాగుంది అన్న విషయం తెలియాలి అంటే కాస్త వేచి చూడాలి..

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :