ఆ కంపెనీని వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి : వైఎస్ షర్మిల
అదానీతో మాజీ సీఎం వైఎస్ జగన్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను రద్దు చేయాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. అదానీతో ఒప్పందం రాష్ట్రానికి పెను భారం. అక్రమ డీల్ కారణంగా పాతికేళ్లపాటు ప్రజలపై రూ.లక్షన్నర కోట్ల భారం పడుతుంది. అర్థరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలి. ఒప్పందాలను రద్దు చేసి, ఆ కంపెనీని వెంటనే బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. ఒప్పందాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. గంగవరం పోర్టును అదానీకి అప్పగించడంపైనా విచారణ జరగాలి అని లేఖలో షర్మిల పేర్కొన్నారు.
Tags :